శ్రీకాంత్ అడ్డాల కథ మన ఇంట్లో జరుగుతున్నట్టే వుంటుంది. అందులో పాత్రలు కూడా మనల్నే ప్రతిబింబిస్తుంటాయి. ఏ ఒక్క పాత్ర కూడా అరువు ఆలోచనతో డిజైన్ చేసినట్టు వుండదు. మన కుటుంబం - మన వూరు - మన వాతావరణం అన్నీ అచ్చంగా మనవే. అందుకే శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎప్పుడొచ్చినా ఇందులో మనకు సంబంధించిన పాత్రలే వుంటాయని భావిస్తూ థియేటర్ కి వెళుతుంటారు ప్రేక్షకులు. అయితే తొలిసారి ఆయన బ్రహ్మోత్సవం కోసం ఎన్నారై పాత్రల్ని ఆశ్రయించాడు. విదేశాల నుంచి వచ్చిన భామలుగా సమంత - కాజల్ కనిపించబోతున్నారు. ప్రణీత మాత్రం లోకల్ అమ్మాయిగా కనిపించబోతోందట. అసలు ఈ ఎన్నారై ఆలోచన ఎందుకొచ్చిందో మరి శ్రీకాంత్ అడ్డాలకి. బహుశా కథ అలా డిమాండ్ చేసుండొచ్చేమో!
అయితే పేరుకే ఎన్నారై అమ్మాయిలం కానీ... మేం మాత్రం తెరపై అచ్చంగా మన తెలుగింటి అమ్మాయిల్లాగే కనిపిస్తామని చెబుతున్నారు సమంత - కాజల్ లు. ఎన్నారై అనగానే అంతా తలపొగరు అమ్మాయిల పాత్రల్ని గుర్తుకు తెచ్చుకుంటుంటారు. కానీ మా పాత్రలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయని కాజల్ చెప్పుకొచ్చింది. ఈ రెండు పాత్రలేనా ఇంకా సినిమాలో మరిన్ని ఎన్నారై పాత్రలుంటాయో చూడాలి. అయితే కాజల్ తన పాత్ర పేరు కాశీ అని చెప్పింది కానీ... సమంత మాత్రం నా పాత్రకి పేరే లేదంటోంది. అదేంటి అంటే? అదంతే శ్రీకాంత్ అడ్డాల సినిమాలో బాబాయ్ లు - మావయ్యలు - అత్తయ్యలు - కోడళ్లు - మరదళ్లు వుంటారు తప్ప పేర్లు వుండవని చమత్కరించింది. అది కూడా నిజమే మరి!