మొన్నటివరకు అసలు మీ హనీమూన్ ఎప్పుడు అంటే.. అబ్బే అలాంటిదేం ప్లాన్ చేసుకోలేదు అని చెప్పారు ఈ కొత్త కపుల్. హీరోయిన్ సమంత మరియు హీరో నాగచైతన్యల వివాహం అక్టోబర్ 6న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సమంత రాజు గార గది 2 సినిమాను ప్రమోట్ చేసింది కూడా. అయితే హనీమూన్ కోసం ఎక్కడికీ వెళ్లట్లేదని.. పని ఉందని చెప్పింది. చైతన్య అయితే మీడియాలోనే కనిపించలేదు. కాని అసలు సంగతి వేరని తెలుస్తోంది.
గత ఐదు రోజుల నుండి సమంత అండ్ చైతన్య ఇద్దరూ కూడా లండన్ వీధుల్లో తెగ కనిపిస్తున్నారు. ముఖ్యంగా నిన్న వారు బ్రిటీష్ మ్యూజియం కు వెళ్ళి అక్కడ శిల్ససౌందర్యాన్ని చూసి ఆస్వాదిస్తున్న వేళ.. చాలామంది కంట పడ్డారు. అలాగే మ్యూజియం పక్కనే ఉన్న హోటళ్ళలో విందు పలహారం ఆరగిస్తూ కాఫీ తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారట. అక్కడ నుండి పక్కనే ఉన్న గుక్కి అనే బ్రాండ్ స్టోర్ కు వెళ్ళి.. అక్కడ సమంత కొన్ని బూట్లను కూడా కొనుక్కుంది. పైగా చైతూ కాఫీ తాగుతున్న వీడియో ఒకటి తీసి.. తన స్నేహితులకు సమంత సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది.
మొత్తానికి ఎవ్వరికీ చెప్పకుండా.. సమంత భలే సీక్రెట్ గా యునైట్ కింగ్డమ్ అంతా చుట్టేయాలని ప్లాన్ వేసిందే అంటున్నారు అభిమానులు. అంతే కదా.. మీడియా గ్లేర్ ను ఎవాయిడ్ చేసి.. చక్కగా తమ ప్రైవసీకి భంగం కలగకుండా బాగానే ప్లాన్ చేసుకుంది. అయితే లండన్ తరువాత ఈ జంట స్కాట్ ల్యాండ్ మరియు బెల్ ఫాస్ట్ కూడా చుట్టేస్తారని ప్రచారం జరుగుతోంది. అది సంగతి.