చూడు ఒకవైపే చూడు! అనే ఓ డైలాగ్ లా మగువల్లోని ఒక కోణమే చూస్తున్నారా? ఆ రెండో కోణం చూడలేకపోతున్నారా? లేక అసలు స్త్రీ అనే ఇజాన్ని చూసేందుకు పురుష పుంగవులు ఇష్టపడడం లేదా? పురుషాధిక్య ప్రపంచంలో ఇది ఎప్పుడూ ఓ ప్రశ్నార్థకమే. సరిగ్గా దానినే ప్రశ్నిస్తోంది అక్కినేని కోడలు సమంత. దేర్ ఈజ్ ఏ HER ఇన్ ఎవ్వెరి HERO అంటూ అదిరిపోయే పోస్టర్ ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేశారు.
హాలీవుడ్ సూపర్ హీరో సిరీస్ లలో ఇప్పుడు కథానాయికలకు కచ్ఛితంగా ఓ హీరో కీలకమైన పాత్రను, స్థానాన్ని కేటాయిస్తున్నారు. అవెంజర్స్, బ్లాక్ పాంథర్, ఆక్వామేన్ వంటి భారీ చిత్రాల్లో నాయికా పాత్ర లు విస్మరించలేనివి. హీరోకి ధీటుగా హీరోయిన్ లను ఎలివేట్ చేశారు. వండర్ ఉమెన్, క్యాట్ ఉమెన్ లాంటి చిత్రాలతోనూ హాలీవుడ్ లో అసాధారణ సంచలనాలు సృష్టించారు. గ్లోబల్ వరల్డ్ మారుతోంది. సినిమాల్లో కంటెంట్ మారుతోంది. విజువల్ బ్రిలియన్సీతో కూడుకున్న కథలకే ప్రాధాన్యత పెరిగింది. లోకల్ ఆడియెన్ లేరు ఇప్పుడు. ఓన్లీ యూనివర్శల్ ఆడియెన్ మాత్రమే ఉన్నారు. ఇప్పటివరకూ మారని వాళ్లు కూడా మారుతున్నారు. భవిష్యత్ ప్రపంచం మొత్తం వర్చువల్ ప్రపంచానికి ధీటుగా పరుగులు పెడుతోంది. అందుకే ఇకపై మన సినిమాల కథలు కూడా మారాలని సందేశం ఇస్తోంది సామ్.
దీంతో పాటే వేరొక అర్థం ఈ ఫోటోలో ప్రతిధ్వనించింది. ఆయన ఎలానూ హీరోనే కాబట్టి.. ఆ హీరోలోనూ హెర్ అనే నేను ఉన్నాననేది సమంత ఉద్ధేశం కావొచ్చు. అక్కినేని నాగచైతన్య అనే హీరోలో సామ్ అనే `హెర్` ఉన్నారన్నమాట. అందుకే మజిలి చిత్రంలో జంటగా నటించారు. మునుముందు కలిసి బోలెడన్ని చిత్రాల్లో నటించనున్నారు జోడీగా.ఆ ఫోటోలో కెప్టెన్ మార్వల్ సూపర్ హీరో బ్రై లార్సన్ అర్థభాగానికి సామ్ అర్థభాగాన్ని కలిపి ఫోటో షాప్ చేశారన్నమాట. సమంత, తమన్నా, కాజల్, రకుల్ చెన్నయ్ లో `కెప్టెన్ మార్వల్` (పవర్ ఆఫ్ ఉమెన్) సినిమా ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. డిస్నీ ఇండియా- మార్వల్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమమిది. అయితే ఆ నలుగురు సౌత్ హీరోయిన్లతో కెప్టెన్ మార్వల్ లాంటి సినిమా ప్లాన్ చేస్తే బావుంటుందేమో!!