ఆమె తిక్కకు లెక్కే లేదండోయ్‌

Update: 2015-04-14 09:29 GMT
ఇప్పుడున్న హీరోయిన్లలో గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో ఎవరైనా సమంత తర్వాతే అని చెప్పాలి. ఈ విషయంలో ఏమైనా డౌట్లుంటే ఆమె ట్విట్టర్‌ అకౌంట్లోకి వెళ్లి ఓ ఏడాది ట్వీట్లు చూసుకుంటే సమంత తిక్కకు లెక్కే ఉండదని తెలిసిపోతుంది. తాను ఏం చేసినా, ఏం మాట్లాడినా మళ్లీ దాని గురించి బాధపడే మనస్తత్వం కాదు సమంతది. కొందరు సమంతకు పొగరంటారు, ఇంకొందరు లౌక్యం తెలియదనంటారు, మరికొందరు భోళా మనిషని అంటారు.

తాజాగా సన్నాఫ్‌ సత్యమూర్తి ప్రమోషన్లో భాగంగా సమంత మాట్లాడిన మాటలు కూడా జనాల్ని చాలా ఆశ్చర్యపరిచాయి. ఓ బిజినెస్‌మేన్‌తో ప్రేమలో ఉన్నారట కదా అంటే అతనెవరు, ఏం చేస్తుంటాడో చెప్పండి, అబ్బాయిని వెతుక్కునే పని తప్పుతుందని అడగడం సమంతకే చెల్లింది. ఇది ఆమె వ్యక్తిగత విషయం కాబట్టి పక్కనబెట్టేద్దాం. కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఆమె చెప్పిన విషయాలే ఆశ్చర్యం కలిగించేవి.

బాలీవుడ్‌లోకి వెళ్లరా అని అడిగితే.. ''నేను అలాంటి తప్పు చేయను. రెండు పడవల మీద ప్రయాణం చేయను'' అనేసింది సమంత. అంటే బాలీవుడ్‌కు వెళ్లడమంటే తప్పు చేయడమేనా? కాజల్‌, తమన్నా చేస్తోంది పెద్ద తప్పా? అయినా తెలుగులో, తమిళంలో నటించడం రెండు పడవల ప్రయాణం కాదా? హిందీలోకి వెళ్తే మాత్రమే రెండు పడవల ప్రయాణమా? అని సందేహాలు రావడం ఖాయం. సమంత అన్న ఇంకో మాట సంగతి చూద్దాం. ఈ మధ్య సాదాసీదా పాత్రలే చేస్తున్నారేంటి అనడిగితే.. అవును, మనం తర్వాత చెప్పుకోదగ్గ సినిమా చేయలేదు అనేసింది. ఆమె వచ్చింది 'సన్నాఫ్‌ సత్యమూర్తి' ప్రమోషన్‌ కోసం. అక్కడికొచ్చి మనం తర్వాత సరైన సినిమా చేయలేదని అనడమేంటో? అందుకే అనేది సమంత సమంతే అని.
Tags:    

Similar News