అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 17న పార్ట్-1 విడుదల కానుంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటించింది. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. అయితే ఇప్పుడు సినిమాలో మెయిన్ హీరోయిన్ అయిన రష్మిక ను సామ్ డౌన్ చేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రష్మిక మందన్నా ను ఇండస్ట్రీలో అందరూ లక్కీ హీరోయిన్ గా పిలుస్తుంటారు. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న ఈ బ్యూటీకి లక్ కూడా బాగానే ఫేవర్ చేసింది. ప్రస్తుతం తెలుగు కన్నడ భాషల్లో సత్తా చాటుతున్న రష్మిక.. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన 'పుష్ప: ది రైజ్' సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటుందని అందరూ భావించారు. దీనికి తగ్గట్లుగానే ప్రమోషనల్ కంటెంట్ లో అమ్మడు ఆకట్టుకుంది.
ఇందులో పుష్ప రాజ్ ప్రేయసి శ్రీవల్లిగా డీ గ్లామర్ లుక్ లో కనిపించి రష్మిక అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్నాళ్లూ గ్లామరస్ పాత్రలు పోషిస్తూ వచ్చిన ఈ బ్యూటీకి 'పుష్ప' సినిమాతో నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్ దొరికింది. పల్లెటూరి అమ్మాయిగా చిత్తూరు యాసలో అదరగొట్టింది. రష్మిక కెరీర్ లోనే ఈ సినిమా గుర్తుండి పోతుందని అందరూ మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాట రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా అన్నీ మారిపోయాయి.
సమంత ఆడిపాడిన ఐటమ్ సాంగ్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఐదు భాషల్లో వచ్చిన ఈ పాట మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. కెరీర్ లోనే తొలిసారి ప్రత్యేక గీతంలో నటించిన సామ్.. పొట్టి పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ స్టెప్పులతో కనువిందు చేసింది. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఆమె మీదకు మళ్లింది. ఈ నేపథ్యంలో 'పుష్ప' అంటే సమంత అనే విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
రష్మిక పెరఫార్మన్స్ చేసిన 'సామీ సామీ' పాట వీడియో ప్రోమో కంటే.. సామ్ ఐటెమ్ నంబర్ గ్లింప్స్ గురించే సినీ ప్రముఖులు మరియు సాధారణ ప్రేక్షకులు పోస్టులు పెడుతున్నారు. వ్యూస్ - లైక్స్ పరంగా కూడా సమంత పాటదే పైచేయి అయింది. ఇలా 'పుష్ప' సినిమాలో హీరోయిన్ కంటే.. స్పెషల్ సాంగ్ చేసిన సమంత గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. దీంతో ఒక్క పాటతో రష్మిక ను సామ్ వెనక్కి నెట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇకపోతే 'పుష్ప: ది రైజ్' సినిమాకు సంబంధించి రష్మిక ప్రమోషన్స్ లో దూకుడు పెంచింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటుగా సోషల్ మీడియా మాధ్యమాలలో చిట్ చాట్ లు చేస్తోంది. ‘పుష్ప’లోని శ్రీవల్లి పాత్ర డీ గ్లామర్ గానే కాదు ‘రా’ గా ఉంటుందని.. ఈ క్యారెక్టర్ లో నటించడం తనకు కొత్త అనుభూతినిచ్చిందని రష్మిక చెబుతోంది.
అలానే ‘సామి సామి’ పాటలో డ్యాన్స్ చేసింది తనేనా అని ఇప్పటికీ అనిపిస్తుంటుందని.. ఈ సాంగ్ అంత అద్భుతంగా వచ్చిందని రష్మిక తెలిపారు. ఇక 'ఊ అంటావా' పాట షూటింగ్ పూర్తవగానే ‘చాలా బాగా చేశావు’ అని సమంత కు వాట్సాఫ్ మెసేజ్ పంపానని రష్మిక వెల్లడించింది. అయితే సామ్ ని పొగుడుతూనే మరోవైపు తన పాట అద్భుతమని చెప్పడాన్ని బట్టి చూస్తే.. హాటెస్ట్ సమంత వల్ల రష్మిక కాస్త కంగారు పడుతోందని నెటిజన్స్ అంటున్నారు. మరి 'పుష్ప' రిలీజ్ అయ్యాక ఎవరికి ఎలాంటి పేరు వస్తుందో చూడాలి.