స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం దర్శకద్వయం రాజ్ నిడిమోరు - కృష్ణ డీకే రూపొందించిన ఈ సిరీస్ లో రాజీ అలియాస్ రాజ్యలక్ష్మి అనే డీ గ్లామర్ పాత్ర పోషించింది.
లైంగిక వివక్షకు గురైన తమిళ ఈలం సోల్జర్ పాత్రలో సామ్ అద్భుతంగా నటించిన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటుగా బోల్డ్ సీన్స్ లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో క్లిష్టమైన రాజీ పాత్రను ఎంచుకోవడానికి గల కారణాన్ని సమంత తాజాగా వివరించారు.
గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 52వ ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ)లో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ నటి లేదా నటుడైనా ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేయాలని.. అవే రకమైన ఎమోషన్స్ చూపించాలని అనుకోరు. సవాలుతో కూడిన కొత్త పాత్రలు.. అలాంటి కథా నేపథ్యం ఉన్న సినిమాల కోసం చూస్తారు'' అని సమంత అన్నారు.
''రాజ్ - డీకే నన్ను వ్యక్తిగతంగా కలవకుండానే, అందులోని పాత్ర కోసం నన్ను ఎంచుకున్నారు. నన్ను కలిశాక వారికి తమ తప్పు దిద్దుకొనే టైమ్ దాటిపోయింది (నవ్వుతూ). కొత్తదనం కోసం తపిస్తున్న నేనూ ఆ పాత్రను ఠక్కున పట్టేసుకున్నా. రాజీ క్యారెక్టర్ నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. నటిగా కొత్త కోణాన్ని అన్వేషించే అవకాశం నాకు ఇచ్చింది. ఇది నాకు కొత్త మార్గాలను తెరిచింది" అని సామ్ చెప్పుకొచ్చారు.
''నటిగా నాకు ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ - హైదరాబాద్ నా పుట్టినిల్లు. నేనింకా హిందీ సినిమాలేవీ చేయలేదు కానీ.. నార్త్ ఇండస్ట్రీకి సౌత్ కు పెద్ద తేడా ఏమీ లేదు'' అని సమంత తెలిపారు. ఈ సందర్భంగా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో అలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడంతో హిందీలో ‘ధూమ్’ లాంటి సిరీస్ లలో అవకాశాలు రావచ్చనే ప్రేక్షకుల ప్రశంసకు సమంత సంతోషిస్తూ.. అయితే నేను ‘యాక్షన్ స్టార్’ అన్న మాట అని నవ్వుతూ బదులిచ్చారు.
ఓటీటీల గురించి మాట్లాడుతూ.. థియేటర్ ఓటీటీ దేనికదే ప్రత్యేకం. కాకపోతే చీకటి హాలులో అంతరాయాలకు దూరంగా చూసే సినిమాతో పోలిస్తే.. ఇంట్లో టీవీలో అనేక అంతరాయాల మధ్య చూసే ఓటీటీ వెబ్ సిరీసులతో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. రొటీన్ కు భిన్నమైన భావోద్వేగాలనూ, పాత్రలనూ పండించేందుకు నటీనటులకు కూడా ఓటీటీ ఓ అవకాశం. అది పెద్ద సవాలుతో కూడినది'' అని సామ్ తన అభిపాయాన్ని వ్యక్తం చేసింది.