కారణం ఏమైనా కానీ.. కలకాలం కలిసి ఉంటారనుకున్న జంట విడిపోతున్నప్పుడు సంబంధం ఉన్న వారికి.. లేని వారికి చాలానే బాధ కలుగుతుంది. అలాంటిది.. కన్నతండ్రికి ఉండే బాధ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా అలాంటి వేదనే సమంత తండ్రి తాజా రియాక్షన్ ను చూసినప్పుడు కనిపిస్తుంది. క్యూట్ కఫుల్ గా పేరున్న సమంత.. నాగచైతన్యలు అధికారికంగా విడిపోతున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే. వీరి విడాకుల విషయం గడిచిన కొంతకాలంగా చర్చగా ఉన్నప్పటికీ.. అధికారికంగా మాత్రం అక్టోబరు 2న ప్రకటించారు.
విడాకుల ప్రకటన అనంతరం నాగచైతన్య మళ్లీ స్పందించింది లేదు. కామ్ గా ఉండిపోయారు. సమంత మాత్రం.. పలు పోస్టులు పెడుతూ.. ప్రస్తుతం తాను ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చైతన్య తండ్రి నాగార్జున.. విడాకులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశారు. సమంత తరఫు వారు ఎవరూ మాట్లాడింది లేదు. తాజాగా సమంత తండ్రి జోసెఫ్.. తన రియాక్షన్ ను పోస్టు చేశారు.
ప్రస్తుతానికి తన మెదడు అంతా శూన్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే అన్ని పరిస్థితులు మామూలుగా మారిపోతాయన్న ఆయన.. ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన పోస్టుతో ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్లు. విడాకుల ప్రకటన తర్వాత చైతూ హోటల్లో ఉండిపోతే.. సమంత మాత్రం చెన్నైలో జరుగుతున్న షూట్ లో బిజీగా ఉన్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. సమంత తండ్రి పోస్టు చూసిన తర్వాత మాత్రం అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థతి.