సమంత 100% రెడీ అవ్వలేదా?

Update: 2023-01-10 06:29 GMT
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా మయో సైటిస్‌ అనే దీర్ఘకాలిక వ్యాదితో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే సమంత ముంబయి ఎయిర్ పోర్ట్‌ లో కనిపించిన విషయం తెల్సిందే. చాలా రోజుల తర్వాత సమంత మీడియా ముందుకు రావడంతో ఆమె ఆరోగ్యం గురించి ఉన్న పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

ఈ నెల లేదా వచ్చే నెల నుండి సమంత సినిమా షూటింగ్స్ కు కూడా హాజరు అవ్వబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. సమంత తాజాగా శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొంది.

ఆ సమయంలో సమంత  మునుపటి ఉత్సాహంతో కనిపించలేదు. సమంత యొక్క ఆరోగ్యం ఇంకా కుదుట పడిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సమంత మయో సైటిస్ నుండి పూర్తిగా కోలుకుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఆమె ఇంకాస్త అస్వస్థతతోనే కనిపిస్తున్నారు. గతంలో మాదిరిగా మీడియా ఇంట్రాక్షన్ సమయంలో యాక్టివ్‌ గా సమం కనిపించలేదు.

ఆమెలో అలసట మరియు శ్వాస తీసుకుంటున్న సమయంలో కాస్త ఇబ్బంది పడుతుండటం ను శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ లో చూడవచ్చు.

సమంత నూరు శాతం ఫిట్ అవ్వలేదని.. అయినా కూడా తాను కమిట్ అయిన సినిమాలు.. షూటింగ్‌ మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో అస్వస్థతను కూడా లెక్క చేయకుండా మీడియా ముందుకు వచ్చిందనే సమాచారం అందుతోంది. ఈ నెల చివరి నుండి లేదా వచ్చే నెల నుండి విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూట్ లో సమంత జాయిన్ అయ్యే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News