ముందే చెప్పుకున్నట్లు.. ''మహానటి'' సినిమా రిలీజయ్యే వరకు సీన్ ఒకలా ఉంటే.. రిలీజయ్యాక మరలా ఉంది. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అసలు కీర్తి సురేష్ అండ్ దుల్కర్ సల్మాన్ లు ఒక రేంజులో ఇంప్రెస్ చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. అందుకే రిలీజ్ కు ముందు ప్రచారం అంతా సమంత.. విజయ్ దేవరకొండ.. అంటూ నిర్వహించారు. కాని రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది.
ఇప్పటికే 30 కోట్లు షేర్ వసూలు చేసిన ఈ సినిమాను చాలామంది రెండేసి మూడేసిసార్లు కూడా చూశారు. అయితే వారిలో ఎవరూ నేను సమంత కోసం చూశా.. విజయ్ దేవరకొండ కోసం వచ్చా.. క్రిష్ అదిరిపోయాడు.. రాజేంద్ర ప్రసాద్ చంపేశాడు అనట్లేదు. అందరూ కూడా మహానటిగా కీర్తి సురేష్.. ఆమె భర్తగా అమ్మాడి అంటూ జెమిని గణేశన్ పాత్రలో డుల్కర్ ఇరగదీశాడు అంటున్నారు. ఏ నోటా విన్నా అదే టాక్. అందుకే కాస్త సమంత కూడా చిన్నబుచ్చుకుంది అంటున్నారు సన్నిహితులు. పైగా ఆమెతో ఒక కొత్త ప్రమోషనల్ ఇంటర్యూ చేద్దాం అంటే.. అస్సలు ఫోన్ కూడా ఎత్తట్లేదని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఎంత యు-టర్న్ షూటింగులో బిజీగా ఉన్నా.. సాయంత్రానికి ఇంటికే వస్తోంది స్యామ్. అయినా కూడా మహానటి టీమ్ తో కాస్త దూరంగా ఉంటోందట.
అయితే సమంత సపోర్టుతోనే ఈ సినిమాకు చాలా హైప్ వచ్చింది అనేమాట వాస్తవం. కాకపోతే సినిమా రిలీజయ్యాక సమంతకు ఏమాత్రం పెద్దగా పేరు రాలేదనేది కూడా వాస్తవమే. కాని సినిమాల విషయంలో అదే కదా మ్యాజిక్ ఏంటే. ఏ సినిమాలో ఎవరికి పేరొస్తుందో.. ఏది ఎందుకు హిట్టవుతుందో ఎవ్వరికీ తెలియదు. అది సంగతి.