బెంగళూరు సినిమాలో సమాంత??

Update: 2015-07-30 11:32 GMT
మలయాళ హిట్‌ చిత్రం బెంగళూరు డేస్‌ తెలుగులో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆర్య, రానా, శ్రీదివ్య తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నిత్యామీనన్‌ పోషించిన పాత్రలో ఎవరిని ఎంపిక చేయాలి? అన్న సందిగ్ధత ఇంతకాలం కొనసాగింది. ఎట్టకేలకు ఆ క్యారెక్టర్‌ కి సమంతని ఎంపిక చేసుకున్నారు.

సమంత ప్రస్తుతం తమిళ్‌ లో స్టార్‌ హీరోల సరసన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్రీకరణలు పూర్తి చేసుకుని రిలీజ్‌ లకు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఈ భామ నటించిన ఓ రెండు సినిమాలు రిలీజ్‌ లకు రానున్నాయి. ఈ లోగానే సమంత బెంగళూరు డేస్‌ రీమేక్‌ లో నటించడానికి సంతకం చేసింది. ఈ చిత్రంలో నిత్యామీనన్‌ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాత్రలో పరకాయం చేస్తోంది కాబట్టి సమంత కూడా అంతే పేరు తెచ్చుకుంటుందేమో చూడాలి.

నిత్యామీనన్‌ కి మల్లూ బాబులతో పాటు సౌత్‌ అంతటా వీరాభిమానులున్నారు. నిత్యా వీరాభిమానుల్ని మెప్పించడం సమంతకు అంత సులువేం కాదు. ఎంతో ఈజ్‌ తో నటిస్తే కానీ అందరినీ మెప్పించడం కుదరదని విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News