టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని హీరో నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో బిజీగానే ఉంది. ఈ ఏడాది 'మజిలీ'.. 'ఓ బేబీ' మరియు 'సూపర్ డీలక్స్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ లను దక్కించుకుంది. ఈ ఏడాదికి సమంత శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని గుడ్ బై చెప్పింది.
నేడు తెల్లవారు జామున సమంత తన స్నేహితురాలు రమ్యతో కలిసి కాలి నడకన తిరుమల చేరుకుంది. తిరుమలలో దర్శనం చేసుకున్న సమంత తిరిగి చెన్నై చేరుకుంది. ఆమద్య మజిలీ చిత్రం విడుదల సమయంలో కూడా సమంత తిరుమలకు కాలి నడకన వెళ్లిన విషయం తెల్సిందే. మజిలీ మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు మళ్లీ సమంత ఏం మొక్కుకుందో కాని కాలి నడకన సమంత తిరుమల వెళ్లింది. సమంతతో తిరుమల వెళ్లిన విషయాన్ని రమ్య సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
సమంతకు చాలా ఆప్త మిత్రురాలైన రమ్య ప్రస్తుతం తమిళ సినీ రంగంలో బిజీ నటిగా ఉంది. ఒకప్పుడు యాంకర్ గా చేసిన రమ్య ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరో అయిన విజయ్ సినిమాలో నటిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు దక్కించుకున్న రమ్య తన స్నేహితురాలు సమంతతో కలిసి తిరుమల ఏడుకొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమల వెళ్లిన సందర్బంగా సమంత చాలా నార్మల్ గా సింపుల్ కుర్తాలో ఉంది. పెళ్లి తర్వాత ఆద్యాత్మికంగా సమంతలో చాలా మార్పులు చూడవచ్చు. పెళ్లికి ముందు క్రిస్టియన్ అయిన సమంత చైతూను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తి స్థాయి హిందువుగా మారిన విషయం తెల్సిందే.