సమంత కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సమంతకు భారీ క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ సమంత అంటే పడి చస్తారు అనడం లో ఏమాత్రం సందేహం లేదు. నాగ చైతన్య ను సమంత పెళ్లి చేసుకున్న సమయం లో చాలా మంది ఆమె అభిమానులు గుండెలు పలిగేలా ఏడ్చామంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెడుతూ ఉంటారు. ఇక ఇప్పటికి కూడా ఆమెను ఎంతో మంది ప్రేమిస్తూ.. ఆరాధిస్తూనే ఉంటారు. సమంత త్వరలో జాను సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమా ట్రైలర్ లోని సమంత ను చూసిన తర్వాత ఒక అభిమాని ఆమెకు ప్రేమ లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ఫిదా అయిన సమంత అతడి పోస్ట్ కు రెస్పాండ్ అయ్యింది. ఒక నోట్ బుక్ లో జాను ఐ లవ్ యూ.. సామ్ ఐ లవ్ యూ అంటూ కొన్ని వందల సార్లు రాసి దాన్ని వీడియో చిత్రీకరించి పోస్ట్ చేశాడు. వీడియోతో పాటు ఇది రాసేందుకు 3 గంటల 15 నిమిషాలు పట్టింది. అమ్మ తిడుతూ ఉన్నా నేను వదిలేయకుండా ఇది పూర్తి చేశాను. ఇది నా ప్రేమ మాదిరి గానే ఎప్పటికి ఎండ్ అవ్వదు అంటూ పోస్ట్ పెట్టాడు.
అతడి పోస్ట్ కు స్పందించిన సమంత.. బాబోయ్ మీ అమ్మగారు నన్ను తిట్టేస్తారేమో. నీ ప్రేమకు కృతజ్ఞతలు. దయచేసి బాగా చదువుకో అంటూ రీ ట్వీట్ చేసింది. అభిమాని ట్వీట్ కు స్పందించి బాగా చదువుకో అంటూ సలహా ఇచ్చినందుకు సమంత పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అభిమానం ఉండవచ్చు కాని అది ముదిరి చదువుపై శ్రద్ద పెట్టకుండా అవ్వొద్దు. అందుకే సమంత దయచేసి చదువుకో అంటూ అతడికి సలహా ఇవ్వడం మంచి విషయం.