ది మిర్రర్ - అర్పితా మెహతా లేబుల్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా `కాఫీ టేబుల్ పుస్తకం` కవర్ షూట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ టు టాలీవుడ్ హాటెస్ట్ గాళ్స్ ఈ పుస్తకంలో దర్శనమివ్వనున్నారు.
ఇప్పటికే పలువురు అందాల భామల ముఖ చిత్రాలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ సమంత డిజైనర్ లుక్ రివీలైంది. సామ్ ఎంతో ముగ్ధమనోహర రూపంతో మైమరిపిస్తోంది ఈ ఫోటోలో. క్రిస్టలైన్ ఎంబ్రాయిడరీ ఫ్లవరిష్ టాప్ సామ్ కోసమే ప్రత్యేకించి డిజైన్ చేసిన తీరు వ్వావ్ అని ప్రశంసించక తప్పదు. ఈ డిజైనర్ లుక్ లో సామ్ అందం పదింతలైందంటే అతిశయోక్తి కాదు. అర్పితా ప్రత్యేకతను ఇది ఎలివేట్ చేస్తోంది. ఇక ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసిన సమంత ఎంతో ఎమోషనల్ గా అర్పిత పదేళ్ల జర్నీ గురించి వర్ణించారు.
``ఈ లేబుల్ దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఉన్న గొప్ప ఖ్యాతికి ప్రతిబింబం. ఇది చాలా మంది వ్యక్తిత్వాల్ని ప్రతిధ్వనించే ఫ్యాషన్ స్టోరీని చెబుతుంది. పదాలు.. కథలు.. పునరాలోచనలు.. భావోద్వేగాలు.. ఇతివృత్తాలు .. అందమైన చిత్రాల ద్వారా ఆవిష్కరిస్తుంది. # 10 సంవత్సరాల ఆర్పిటామెహతా.. ఇది సరదాగా ఉంది`` అంటూ చాలా ఎమోషనల్ గా కామెంట్ ని పోస్ట్ చేశారు సమంత.
ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. పౌరాణిక నేపథ్యంలో సినిమా ఇది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సినిమా కోసం భారీ సెట్స్ ని రూపొందిస్తున్నారు. శంకుతల పాత్రలో నటించబోయే సమంత కోసం ప్రత్యేకమైన చీరలను సిద్ధం చేస్తున్నారని.. నార చీరలు ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారని తెలిసింది.