ఇప్పుడు సమంత 'జనతా గ్యారేజ్' ఆడియో లాంచ్ కు మిస్సు కొట్టి.. బెంగుళూరులో 'బాహర్ కేఫ్' రిబ్బన్ కటింగుకు మాత్రం వెళ్ళిందనే న్యూస్ ఎంత హాట్ టాపిక్ అయిపోయిందో మనకు తెలిసిన విషయమే. అయితే సదరు కేఫ్ ఓపెనింగ్ ఫోటోలు చూశాక మాత్రం.. స్వాతంత్ర్యదినోత్సవం పర్వదినాన ఎవ్వరైనా కూడా ఒక సెక్యులర్ మూమెంట్ గురించి డిస్కస్ చేయకుండా ఉండలేరు.
'బాహర్ కేఫ్' అంటే ముస్లింలు నడుపుతున్న ఒక కేఫ్ అనే ఎవరైనా అనుకుంటారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఉన్న 'కేఫ్ బాహర్' ముస్లింలదే కాని.. ఈ 'బాహర్ కేఫ్'లో మాత్రం ఎవరో రెడ్డి ఒకాయన పార్టనర్ కూడానట. ఇకపోతే.. బెంగుళూరు బాహర్ కేఫ్ ఓపెన్ చేసింది చెన్నయ్ కు చెందిన ఒక క్రిస్టియన్ అమ్మాయి సమంత. కాని ఆమె చక్కగా నుదుటున బొట్టు పెట్టుకుని వచ్చింది. ఇక బాహర్ కేఫ్ ను పూజలు చేసి గృహప్రవేశం చేయించిన బ్రాహ్మణ పూజారిని మనం ఫోటోల్లో చూడొచ్చు. చూస్తుంటే ఈ కేఫ్ ఓపెనింగ్ సెర్మనీ యావత్తు భారత దేశాన్ని ఒకేసారి చూపిస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. అందుకే బాహర్ టాక్ భలేగుందే అని చెప్పింది.
ఇకపోతే ఈ కేఫ్ ఓపెనింగ్ సమయంలో మాట్లాడిన సమంత.. తదుపరి తాను చాలా కత్తిలాంటి ప్రాజెక్టులు చేయాలని అనుకుంటున్నానని.. అందుకే దేనికీ ఇంకా ఓకె చెప్పలేదని సెలవిచ్చింది కూడా. ఏదేమైనా.. సమంత సమంతే.