తమిళ్ బ్లాక్ బస్టర్ 96 తెలుగులో జాను టైటిల్ తో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఇదొక కల్ట్ క్లాసిక్ మూవీగా వచ్చి సంచలనాలు సృష్టించింది. రామ్.కె పాత్రలో నటించిన విజయ్ సేతుపతికి..జాను పాత్రలో నటించిన త్రిషకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇద్దరి కెరీర్ కి 96 ఓ మైలురాయి లాంటిది. రకరకాల ఏజ్ లలో లవ్ స్టోరీలను దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. 1996లో బ్యాచ్ కు సంబంధించిన కొన్ని వాస్తవ సంఘటలను ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించారు. ఇక తెలుగు రీమేక్ లో విజయ్ పాత్రలో శర్వానంద్...త్రిష పాత్రలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.
జాను అన్ని పనులు పూర్తిచేసుకుని ఈ నెలలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రచార పనుల్లో యూనిట్ బిజీగా ఉంది. శర్వా- సమంత జోడీ ఈ సినిమాను పైకి లేపే ప్రయత్నంలో బిజీ. రీమేక్ వెర్షన్ పై సరైన బజ్ లేని నేపథ్యం లో తమ వంతు ప్రయత్నం చేస్తోంది టీమ్. దీంతో శర్వా..సమంత కాలేజీ స్టూడెంట్స్ ను టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి స్టోరీలు యువతకు ఈజీగా కనెక్ట్ అవుతాయని ప్లాన్ చేసి ఏపీ-తెలంగాణ లో కాలీజ్ లను చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యం లో జాను సీక్రెట్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు.
తమిళ్ లో 1996కి బ్యాచ్ కి సంబంధించిన స్టోరీ అయితే దీన్ని తెలుగు రీమేక్ కోసం 2004 స్టూడెంట్ బ్యాచ్ కి చెందిన స్టోరీగా మార్చారని సమంత తాజాగా తెలిపింది. 96 నుంచి కేవలం సోల్...ఫీల్ మాత్రమే తీసుకుని మిగతా కథ అంతా 2004 జనరేషన్ ఎలా ఉంటుందో? అప్పటి ప్రేమ కథలు ఎలా ఉండేవి? పిల్లల పరిణతి స్థాయి ఎలా ఉండేది వంటి ఆసక్తికర అంశాలతో ఓ కొత్త పంథా సినిమానే తలపిస్తుందని తెలిపింది. మాతృక సక్సెస్ కు కారణమైన ఏ అంశాన్ని జాను నుంచి తొలగించ లేదని..ఎమోషన్ మాత్రం మతృకకు ఒక మెట్టు పైనే ఉంటుందని ఆసక్తికరంగా మాట్లాడింది. అన్నట్టు సినిమా సంగతులతో పాటు సమంత చేసిన ఓ వ్యాఖ్య అంతే వైరల్ గా మారింది. అసలు శర్వానంద్ కి ఎఫైర్లు ఏవైనా ఉన్నాయా? అంటూ గూగేల్ లో వెతికానని అయితే తనకు అలాంటివి ఎక్కడా కనిపించలేదని కితాబిచ్చేసింది. శర్వా క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో అంటూ విద్యార్థుల ముందే పొగిడేసింది మరి.