హీరోయిన్ల సక్సెస్ రేట్‌ను బట్టి వాళ్ల కెరీర్‌ను అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఏడాదిలో ఐదారు సినిమాలు చేస్తారు. అందులో రెండు హిట్టయినా సక్సెస్‌ఫుల్ హీరోయిన్ కిందే లెక్కగట్టాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ పది శాతం లోపే ఉంటుంది. సమంతకు గత ఏడాది ఆటోనగర్ సూర్య, రభస లాంటి ఫ్లాపులున్నప్పటికీ మనం లాంటి మెమొరబుల్ హిట్, అల్లుడు శీను లాంటి రీజనబుల్ మూవీ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ ఏడాది సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు డిడైడ్ టాక్ వచ్చినా చివరికి అది కూడా హిట్ క్యాటగిరీలోనే చేరింది. అయినప్పటికీ సమంత పనైపోయిందంటూ ఓ వర్గం ప్రచారం మొదలుపెట్టింది. ఆమె కెరీర్ త్వరలోనే ముగిసిపోవచ్చని కూడా అంచనా వేశారు కొంతమంది.
ఐతే ప్రస్తుతం సౌత్ ఇండియా అత్యంత క్రేజ్ ఉన్న హీరోయిన్ సమంతే అని చెప్పాలి. అరడజను భారీ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయిప్పుడు. మరే హీరోయిన్ కూడా ఇన్ని భారీ ప్రాజెక్టులతో ఇంత బిజీగా లేదు. ముఖ్యంగా తమిళంలో ఆమె చేస్తున్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. విక్రమ్‌తో 'పత్తు ఎన్రదుకుల్లా' పూర్తి చేసి.. ధనుష్‌తో 'వీఐపీ-2' ఫినిష్ చేసే పనిలో ఉంది సమంత. సూర్యతో '24' కూడా షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్‌తో మరోసారి జోడీ కడుతున్న సినిమా కూడా ఈ మధ్యే మొదలైంది. ఇవి కాక ధనుష్‌తో 'వాడా చెన్నై' కూడా చేయాల్సి ఉంది. మొత్తానికి తమిళంలో ఐదు క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమె హీరోయిన్. తెలుగులో సినిమాల్లేవన్న వెలితి తీర్చుకుంటూ ఈ మధ్యే శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబుల 'బ్రహ్మూెత్సవం'లోనూ చోటు దక్కించుకుంది సమంత. తెలుగు వరకు చూస్తే ఆమె జోరు తగ్గినట్లే కానీ.. మొత్తంగా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో లెక్కగడితే సమంతే ఇప్పుడు టాప్ హీరోయిన్.