సమంత.. సెన్సేషనల్‌ సిక్సర్‌

Update: 2015-04-13 11:30 GMT
ఈ మధ్య వరుసగా ఫ్లాపులు ఎదురవుతుండొచ్చు.. ఇంతకుముందు ఉన్నన్ని భారీ ప్రాజెక్టులు చేతిలో లేకపోవచ్చు. అయినప్పటికీ సమంతది గోల్డెన్‌ హ్యాండే అని ఒప్పుకోవాల్సిందే. అగ్ర హీరోయిన్లలో ఆమెకు ఆమే సాటి అని ఒప్పుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు.. సమంత నటించిన ఆరు తెలుగు సినిమాలు యుఎస్‌లో మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో నిలుస్తున్నాయి. ఇప్పటికే సమంత నటించిన అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు, మనం, ఈగ సినిమాలు మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో అడుగుపెట్టాయి.

ఇప్పుడిక సన్నాఫ్‌ సత్యమూర్తి కూడా ఆ క్లబ్బులో చేరడానికి పరుగులు పెడుతోంది. ఆ సినిమా తొలి మూడు రోజుల్లోనే 73 వేల డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదివారం వసూళ్లు కూడా కలిపితే మిలియన్‌ మార్కుకు చాలా దగ్గరగా ఉండే అవకాశముంది. కాబట్టి సన్నాఫ్‌ సత్యమూర్తి కూడా మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరడం లాంఛనమే అని చెప్పాలి. అంటే సమంత సెన్సేషనల్‌ సిక్సర్‌ కొట్టేసినట్లే అన్నమాట. యుఎస్‌లో ఫ్యామిలీ సినిమాలకు ఎప్పుడూ మంచి కలెక్షన్లే ఉంటాయి. అక్కడ త్రివిక్రమ్‌ సినిమాలకు పిచ్చ క్రేజ్‌ ఉంది. దీంతో టాక్‌ ఎలా ఉన్నప్పటికీ 'సన్నాఫ్‌ సత్యమూర్తి' కలెక్షన్లకు తిరుగులేదు.
Tags:    

Similar News