కొన్ని నెలల సస్పెన్స్ కు తెర దించేశారు.. సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. నాగ చైతన్య సమంత కలిసి ఉండటం లేదు అంటూ వస్తున్న వార్తలను చూసి వాటిని నమ్మకుండా మళ్లీ వారు కలుస్తారు.. కలిసి సినిమా చేస్తారు అని ఎదురు చూసిన అభిమానులకు షాక్ తప్పలేదు. గత కొన్ని నెలలుగా మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా సమంత మరియు నాగచైతన్యలు విడిపోయారు. అధికారికంగా విడాకులు కూడా తీసుకునేందుకు సిద్దం అయ్యారు అని తేలిపోయింది. సస్పెన్స్ కు తెర దించేలా నాగ చైతన్య మరియు సమంతలు ఇద్దరు కూడా ఒకే నోట్ ను తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరి దారిలో వారు నడవాలనే నిర్ణయానికి వచ్చేశాం. మా ప్రైవసీకి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు అంటూ నోట్ లో పేర్కొన్నాడు.
అభిమానులు ఏదైతే నిజం అవ్వకూడదు అనుకున్నారో అదే జరిగింది. ఇద్దరి జంటకు మంచి గుర్తింపు ఉంది. అందమైన జంట అని మాత్రమే కాకుండా సమంత మరియు నాగచైతన్యలు ది బెస్ట్ కపుల్ అంటూ కూడా చాలా మంది అభిమానించే వారు. అలాంటి సమంత మరియు నాగచైతన్యలు విడిపోవడం నిజమే అనే విషయం అభిమానులకు కాస్త భారంగా ఉంది. మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తే అయినా కూడా అధికారికంగా నాగచైతన్య చెప్పేయడంతో క్లారిటీ వచ్చేసింది. నాగచైతన్య మరియు సమంతలు సుదీర్ఘ కాలం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎంతో ఆప్యాయంగా వీరు ఇద్దరు కనిపించారు. హాలీడేస్ రెగ్యులర్ గా వెళ్తూ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తూ వచ్చే వారు.
కొన్ని నెలల క్రితం తన సోషల్ మీడియా అకౌంట్ పేరులో అక్కినేని పదం తొలగించిన సమయంలోనే ఏదో జరుగుతుంది అనే అనుమానం మొదలు అయ్యింది. అప్పటి నుండి కూడా చైతూ తో సమంత కలిసి కనిపించలేదు. దాంతో ఇద్దరి మద్య విభేదాలు.. విడిపోవడం వంటివి జరుగుతున్నాయి అనే వార్తలు మొదలు అయ్యాయి. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లుగా జరిగిన పరిణామాలు అన్ని చూసి జనాలు కొందరు నిజమే అయ్యి ఉంటుందని అనుకున్నారు. పెద్దలు ఇద్దరి మద్య కాస్త రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందట. ఇద్దరు కూడా విడిపోయి స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై మీడియా మరీ ఎక్కువగా లాగకుండా వారి నిర్ణయాన్ని గౌరవించాలని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.