మజిలీ- ఓ బేబి లాంటి హిట్ చిత్రాల్లో నటించింది సమంత. కానీ ఆ తర్వాత తను నటించిన సినిమాలేవీ తెలుగులో రిలీజ్ కాలేదు. ఇంతలోనే నాగచైతన్యతో బ్రేకప్ సంచలనమైంది. అదే క్రమంలో ఫ్యామిలీమ్యాన్ 2 సిరీస్ లో రాజీ పాత్రతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. 'పుష్ప'లో ఊ అంటావా పాటతో చాలా స్పెషల్ గా ఉత్తరాది యూత్ గుండెల్లో కొలువై ఉంది.
ఏది ఏమైనా ఇప్పుడు సమంత తిరిగి తనను ఇంతటి దానిని చేసిన టాలీవుడ్ రుణం తీర్చుకునేందుకు రెడీ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ తాను నటించిన సినిమాలను అభిమానుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ కి వెళ్లే ముందే టాలీవుడ్ లో మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
సామ్ నటించిన శాకుంతలం.. యశోద చిత్రాల విడుదలలకు టైమ్ దగ్గర పడింది. శాకుంతలం నవంబర్ 4న విడుదలవుతుందని దిల్ రాజు ప్రకటించాక 'యశోద' నిర్మాతలు దీపావళికి విడుదల చేయాలనుకున్న తమ చిత్రాన్ని వాయిదా వేశారు. కానీ వీఎఫ్ ఎక్స్ సహా నిర్మాణానంతర పనుల కారణంగా 'శాకుంతలం' ప్రకటించిన తేదీన విడుదల కాదని వచ్చే ఏడాదికి వాయిదా పడొచ్చని స్పష్టమైంది. దాంతో యశోద మేకర్స్ కి విడుదలకు స్కోప్ దొరికింది. నవంబర్ 11వ తేదీన రిలీజ్ ని ఖరారు చేస్తారని భావిస్తున్నా అధికారికంగా దీనిని వెల్లడించాల్సి ఉంటుంది.
అయితే సమంత ఈ రెండు సినిమాలను ప్రమోట్ చేసేందుకు ఇక అజ్ఞాతం వీడాల్సి ఉంటుంది. తెలుగు మీడియా ముందుకు రావాల్సి ఉంది. అయితే తనకు ఎదురయ్యే చిక్కు ప్రశ్నల గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సామ్ ఇటీవల సడెన్ గా అమెరికా ఎందుకు వెళ్లినట్టు? స్కిన్ ట్రీట్ మెంట్ నిజమా? అంటూ ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అలాగే చైతన్యతో బ్రేకప్ పైనా కొన్ని ప్రశ్నలు తప్పదు. కానీ వీటన్నటికీ సమాధానాలిచ్చేందుకు సామ్ సిద్ధంగా లేదని సమాచారం. ఇంటర్వ్యూల్లో వ్యక్తిగత ప్రశ్నల కంటే కెరీర్ .. సినిమాలకు సంబంధించిన ప్రశ్నలపైనే ఫోకస్ చేయాలని కండీషన్ పెట్టనుందట.
ఇటీవల నాగచైతన్య సైతం తన సినిమాల గురించి మాత్రమే అడగాలని వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లడం తగదని మీడియాని వారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా సమంత కొన్ని కండీషన్లపై మీడియా ప్రమోషన్లకు వస్తుందని గుసగుస వినిపిస్తోంది. యశోద నాయికా ప్రధాన చిత్రం. ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని హోప్ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.