మరో రెండు రోజుల్లో 'జాను' తో ప్రేక్షకులను పలకరించనుంది సమంత. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. '96' సినిమా రీమేక్ చేయకూడదని మొదట్లో అనుకున్నానని అందువల్లే చాలా రోజులు దిల్ రాజు ని కలవకుండా మేనేజర్ తో ఏవేవో చెప్పించి తప్పించుకున్నాని తెలిపింది. ఇక చైతూ కి కూడా ఆ క్లాసిక్ సినిమాను రీమేక్ చేయడం ఇష్టం లేదని చెప్పుకుంది సామ్.
ఇక ఎట్టకేలకు దిల్ రాజు కలిసి కలవగానే సినిమా ఒప్పుకున్నానని అప్పుడు ఒప్పుకోకపోతే నా కెరీర్ లో ఓ మంచి క్యారెక్టర్ మిస్సయ్యివుండేదని తెలిపింది. ఇక విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ కి శర్వా బెస్ట్ అంటూ హితాబిచ్చింది. ఇదే ఇంటర్వ్యూలో రంగస్థలం చేయకముందు పూర్తి కథ కూడా తెలియదని జస్ట్ నా క్యారెక్టర్ వరకూ అలాగే కొంత స్టోరీ మాత్రమే తెలుసనీ అది లక్కీ ప్రాజెక్ట్ అని కథను నమ్మి చేసిన సినిమా కాదని తెలిపింది.
ఇక చైతూకి కథల సెలెక్షన్ లో ఏదైనా సలహా ఇస్తారా అంటే అలాంటివేమి ఉండవని ఇద్దరం సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటామని చెప్పుకుంది. ఇక రిటర్మెంట్ అయ్యేలోపు మంచి క్యారెక్టర్స్ చేయాలనుందని తనకి ఇప్పుడే అలాంటి ఆలోచన లేకపోయినా ఒక ఫ్యామిలీ విమెన్ అయ్యాక ఓ స్టేజిలో సినిమాలకు స్వస్తి చెప్పడం కామం అంటూ తెలిపింది సామ్. ఇక ఎలాంటి హైప్ లేకుండా వస్తున్న జాను సమంత కెరీర్ లో నిజంగానే బెస్ట్ ఫిలిం అవుతుందా చూడాలి.