దేవ‌ర‌కొండ‌కు స‌మంత బాస‌ట‌!

Update: 2018-09-08 10:01 GMT
రీసెంటుగానే యువ‌హీరో నాగ‌శౌర్య ఓ ప‌బ్లిక్ వేదిక‌పై చేసిన కామెంట్ అంద‌రినీ ఆక‌ర్షించింది. శౌర్య ఏంటి ఇలా అనేశాడు? అంటూ కొంద‌రు ఈగోల‌కు పోయారు. స్టార్‌ డ‌మ్ అన్న‌ది అంత ఈజీ కాదు. అది కేవ‌లం రామ్‌ చ‌ర‌ణ్‌ తోనే ఆగిపోయింది! అని కామెంట్ చేశాడు. త‌న ఉద్ధేశం ఏదైనా దానిని కొంద‌రు పాజిటివ్ కోణంలో విశ్లేషిస్తే - మ‌రికొంద‌రు నెగెటివ్ కోణాన్ని ఎలివేట్ చేశారు. అస‌లే తెలంగాణ‌లో నైజాం హీరోల మ‌ధ్య చిన్న‌పాటి ఈగోలు త‌లెత్తాయ‌న్న చ‌ర్చ సాగుతున్న వేళ శౌర్య (ఏపీ - నైజాం మూలాలున్న హీరో) కామెంట్ ఆస‌క్తి రేకెత్తించింది.

ఇక్క‌డ నితిన్ - దేవ‌ర‌కొండ మ‌ధ్య కొద్దిపాటి కాంపిటీష‌న్ మొద‌లైంది. అనూహ్యంగా దేవ‌ర‌కొండ 100కోట్ల క్ల‌బ్ హీరో అయ్యాక‌ - అత‌డే నైజాం మెగాస్టార్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే స‌ద‌రు యువ‌ ట్యాలెంటును ప్రోత్స‌హించాల‌న్న స‌దుద్ధేశంతో ఇలా మెగా కాంపౌండ్ స‌హా అంద‌రూ ఎంక‌రేజ్ చేస్తుంటే దీనిని కొంద‌రు నెగెటివ్ కోణంలోనూ తీసుకుంటున్నార‌ట‌.

తాజాగా స‌మంత చేసిన ఓ వ్యాఖ్య ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కొచ్చింది. ``స్టార్‌ డమ్ ఉచితంగా రాదు. దాని వెన‌క చాలా ఏళ్ల శ్ర‌మ ఉంటుంది. కొంత‌ అదృష్టం ప్ర‌తిభకు యాడ‌వ్వాలి. కొత్త హీరోలు క‌థ‌లు బాగుంటే సినిమాని బంప‌ర్‌ హిట్ చేస్తున్నారు. ఆ విజ‌యాలు ప‌రిశ్ర‌మ‌లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రెండు - మూడు సినిమాల‌తోనే పెద్ద స్టార్లు అవుతున్నారు`` అంటూ సామ్ చేసిన వ్యాఖ్యానాన్ని బ‌ట్టి మారిన ట్రెండ్ ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది. అయితే శౌర్య కామెంట్‌ కి సామ్ వ్యాఖ్యానం పూర్తి విరుద్ధంగా ఉంది. స్టార్ డ‌మ్ ఏ ఒక్క‌రి వ‌ద్ద‌నో ఆగిపోదు. ఎవ‌రైనా అందిపుచ్చుకోవ‌చ్చు! అన్న అర్థం రావ‌డంతో ఇదేమైనా సెటైర్‌ నా? అంటూ ఆస‌క్తిక‌ర డిబేట్ మొద‌లైంది. నిజ‌మే నేటి ట్రెండ్ చూస్తుంటే స‌మంత చెప్పిన‌ట్టే ఉంది.  శౌర్య చెప్పిన దానికి పూర్తి కాంట్రాస్ట్‌ గా ఉంది. స్టార్‌ డ‌మ్ ఒక‌రి సొత్తు కాదు. గ‌ట్స్‌ తో ముందుకెళ్లే దేవ‌ర‌కొండ‌లు ఎంద‌రైనా ముందుకు రావొచ్చు. ఇక్క‌డ స‌క్సెస్ అందుకుని కోట్లు కొల్ల‌గొట్ట‌వ‌చ్చు. ప్ర‌తిభ‌కు ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్లు అవ‌స‌రం లేద‌ని ప్రూవ్ అవుతోంది. మంచితనం - ప్ర‌తిభ‌ - దూసుకుపోయే చొర‌వ ఉంటే ఎవ‌రికైనా ప‌ట్టంగ‌ట్టేందుకు ప‌రిశ్ర‌మ సిద్ధంగా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఎంత పెద్ద బ్యాక్‌ గ్రౌండ్ ఉన్న హీరోలు అయినా స‌రైన ఎంపిక‌లు కుద‌ర‌క‌పోతే - రేసులో వెన‌క్కి వెళ్లే ఛాన్సుంద‌న‌డానికి వేరే కాంపౌండ్లు చాలానే ఎగ్జాంపుల్‌ గా ఇండ‌స్ట్రీలో నిలుస్తున్నాయి. ఆంధ్రా, నైజాం అనే తేడా లేకుండా అంద‌రు న‌వ‌త‌రం హీరోలు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇందులో చాలానే ఉంది. ఇప్పుడైనా అర్థ‌మైందా? అస‌లు పాయింట్‌?
Tags:    

Similar News