ఫోటో స్టొరీ: సమంతా.. ఉపాసన ఇద్దరూ ఇద్దరే!

Update: 2019-04-11 09:25 GMT
సమంతా ఎంత పెద్ద స్టార్ హీరోయినో అంతకంటే పెద్ద ఫిట్నెస్ ఫ్రీకు. జిమ్ములో ఉండే వెయిట్లను అవలీలగా ఎత్తి అవతల పారేస్తుంది. చూసేందుకు స్లిమ్ముగా ఉన్నా ఫిట్నెస్ మాత్రం టన్నుల్లో ఉంటుంది. జిమ్ములో సమంతా చేసే కఠినమైన కసరత్తుల వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో సార్లు నెటిజనులను షాక్ కు గురి చేశాయి.  తాజాగా సమంతా బీ పాజిటివ్ మ్యాగజైన్ కోసం పోజులిచ్చింది.  

చరణ్ వైఫ్ ఉపాసన బీ పాజిటివ్ మ్యాగజైన్ ను నడుపుతుందనే సంగతి తెలిసిందే.  ఫిట్నెస్.. హెల్త్ కు సంబంధించిన ఈ మ్యాగజైన్ కోసం ఉపాసన స్వయంగా సమంతాను ఇంటర్వ్యూ చేసింది.  సమంతాతో అయితే కంఫర్ట్ ఉంటుందని.. అందుకే ఇంటర్వ్యూ కోసం మొదటగా ఆమెను ఎంచుకున్నానని ఉపాసన చెప్పింది.  ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి డంబెల్స్ చేతిలో పట్టుకుని.. చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చారు.  ఈ మ్యాగజైన్ లో సమంతా తను రెగ్యులర్ గా ఎలాంటి డైట్ ఫాలో అవుతుందనే వివరాలు అందించింది.

ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఉపాసన "స్వీటెస్ట్ స్ట్రాంగెస్ట్ సమంతా బీ పాజిటివ్ మ్యాగజైన్ లో.  టాలీవుడ్ లో ఉత్తమ కోడలు అవార్డు సమంతాకే" అంటూ ట్వీట్ చేసింది.  అటు మెగా కోడలు.. ఇటు అక్కినేనివారి కోడలు.. కాంబో అదిరిందిగా!


Tags:    

Similar News