చీరలో వెళితే అంత బాగోదుగా -సమంత

Update: 2018-05-07 04:25 GMT
ప్రస్తుతం సమంత ఫుల్ ఖుషీగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఒక స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత సైడ్ అయిపోవాల్సిందే అన్నది టాలీవుడ్ సినిమా సూత్రం. ఒకవేళ చేసినా ఆడియన్స్ చూడరు అని మేకర్స్ నమ్మకం. ఇలాంటి వాటిని రామ్ చరణ్ మూవీ రంగస్థలంతో బద్దలు కొట్టేసింది సమంత. పెళ్లయిన హీరోయిన్ కూడా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టచ్చని ప్రూవ్ చేసింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన సైడ్ అయిపోయి.. కొన్నేళ్లకు అక్క వదిన పాత్రలతో సరిపెట్టుకోవాలనే సిద్ధాంతాలను బ్రేక్ చేసింది సామ్.

అయితే.. ఆమెపై కొంత ట్రాలింగ్ జరుగుతున్న మాట వాస్తవమే. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ తో లిప్ లాక్ సన్నివేశం.. సోషల్ మీడియాలో తాను బికినీతో ఉన్న పిక్చర్స్ ను షేర్ చేయడం వంటివాటితో జనాలు ఆమెను టార్గెట్ చేశారు. 'స్విమ్ సూట్ లో ఉన్న ఫోటో పెడితే జనాలు నన్ను ట్రాల్ చేస్తారని నాకు తెలుసు. కానీ బీచ్ కు వెళ్లినపుడు స్విమ్ సూట్ కాకుండా.. చీరను కట్టుకోవాలా? అయినా నేనేమీ నాపై జనాల దృష్టిని తిప్పుకునేందుకు వాటిని పోస్ట్ చేయను. ఆ అవసరం నాకు లేదు' అంటోది సమంత.

'అయినా నేను ఎలాంటి పోస్టులు చేయాలో ఎవరైనా ఎందుకు చెప్పాలి? నేను పెళ్లయిన వ్యక్తిని కాబట్టి నన్ను ట్రాల్ చేస్తారంతే. నేనేమీ భయపడను.. నేను అలాంటి ట్రాప్ లో పడను. అయినా.. అదే పని పెళ్లయిన స్టార్ హీరోలు చేస్తే ఎవరూ అడగరు కదా. నేను మహిళను కాబట్టి అడుగుతారంతే. నా ఫ్యామిలీ.. ముఖ్యంగా నా మామగారు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు' అని చెప్పింది సామ్.
Tags:    

Similar News