టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత గత కొన్ని రోజులుగా మయో సైటీస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల 'యశోద' సినిమాకు డబ్బింగ్ చెబుతున్న సందర్భంగా చేతికి సెలెన్ బాటిల్ వున్న ఫొటోని షేర్ చేసిన సమంత అభిమాను షాకిచ్చింది. తాను గత కొన్ని రోజులుగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో మీముందుకు వస్తానని తెలిపింది.
ఆ రోజు నుంచి మీడియాకు దూరంగా వుంటూ వస్తున్న సామ్ 'యశోద' రిలీజ్ సమయంలో సమకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం.. అందులో తన ప్రస్తుతం పరిస్థితి గురించి వెల్లడించడమే కాకుండా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానుల్ని తీవ్రంగా కలిచివేసింది. అప్పటి నుంచి ఇంత వరకు మళ్లీ సమంత మీడియా ముందుకు రాలేదు. రీసెంట్ గా విమానాశ్రయంలో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
అయితే సామంత లెఫ్ట్ హ్యాండ్ లో మాత్రం జపమాల కనిపించి పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. సోమవారం 'శాకుంతలం'ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లోనూ సమంత అదే జపమాలతో కనిపించడంతో సామ్ ఏం చేస్తోంది. తనలో ఆథ్యత్మిక చింతన మొదలైందా?. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించని సామ్ ఏం చేస్తోందనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. గత కొంత కాలంగా మయోసైటీస్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న సామ్ మంచి ఆరోగ్యం, మనశ్శాంతి కోసం జపం చేస్తోందట.
ప్రతీ రోజు 10.008 శ్లోకాలు జపిస్తూ సమంత ప్రత్యేక జపం చేస్తోందట. అందుకే ఎక్కడికి వెళ్లిన వెంట జపమాట కంపల్సరిగా మారిందని తెలుస్తోంది. స్వతహాగా క్రిస్టియన్ అయిన సమంత రీసెంట్ గా హిందువుగా మారినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ కారణంగానే తను ప్రతీ రోజు హిందూ శ్లోకాలని జపిస్తూ ప్రత్యేకంగా ధ్యానం చేస్తోందని చెబుతున్నారు. చైతో విడిపోయిన తరువాత తన స్నేహితులతో కలిసి ఆధ్మాత్మక యాత్రకు వెళ్లిన సమంత అప్పటి నుంచి హిందూ శ్లోకాలని పఠిస్తూ మనశ్శాంతిని, ఆయురారోగ్యాలని ప్రసాదించమని జపం చేస్తున్నదని ఇన్ సైడ్ టాక్. ఆ కారణంగానే నిత్యం తన వెంట జపమాలని పెట్టుకుంటోందట.
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'. మలయాళ నటుడు వేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీని నిర్మాత దిల్ రాజు ఫిబ్రవరి 17న అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.