శాకుంతలం.. సమంత ఫ్యాన్స్ ని ఊరించి ఉసూరుమనిపించారు

Update: 2022-09-29 14:47 GMT
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న శాకుంతలం సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంత అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా శాకుంతలం సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వక పోడంతో దర్శక నిర్మాత గుణశేఖర్ పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.

షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతున్నా కూడా ఇంకా సినిమా విడుదల తేదీని ప్రకటించక పోవడం ఏంటీ.. అసలు సినిమా ఉందా.. ఔట్ పుట్‌ సరిగా రాలేదని వదిలేశారా అంటూ సమంత అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేశారు. ఫ్యాన్స్ ఒత్తిడి కారణమో లేదా మరేంటో కానీ సినిమా యొక్క విడుదల తేదీని ఇటీవలే గుణశేఖర్ టీమ్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.

నవంబర్‌ 4వ తారీకున సినిమాను విడుదల చేయబతోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన రావడంతో అభిమానులు సంతోషించారు. మరీ ఇంత తక్కువ గ్యాప్ తో విడుదల తేదీని ప్రకటిస్తారని అనుకోలేదు అంటూ గుణశేఖర్ కి కృతజ్ఞతలు కూడా చెప్పారు. సమంత అభిమానులు ఆనందంతో కౌట్‌ డౌన్ కూడా మొదలు పెట్టారు. ఆ తేదీన రావాలనుకున్న ఇతర సినిమాలు వాయిదా పడ్డాయి.

అంతా నవంబర్ 4 వ తారీకు కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో అనూహ్యంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ విషయంలో మరింత క్వాలిటీ కోసం ఇంకాస్త సమయం కావాలని చెప్పి ఆ తేదీకి విడుదల చేయలేం అంటూ గుణశేఖర్ టీమ్‌ అధికారికంగా ప్రకటించారు. ఇంతోటి దానికి అసలు విడుదల తేదీని ప్రకటించాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సమంత అభిమానులు మళ్లీ గుణశేఖర్‌ పై విమర్శలు మొదలు పెట్టారు. వచ్చే ఏడాదికి గాని శాకుంతలం సినిమా విడుదల అయ్యే పరిస్థితి లేదని కొందరు అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News