'ధనమూలమిదం జగత్'.. 'పైసామే పరమాత్మ హై'.. లాంటి కొటేషన్స్ తో పాటుగా డబ్బు విలువ చెప్పే పాటలు మన సినిమాల్లో చాలానే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో శివ నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మనీ' లో 'చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ' అంటూ సాగే సూపర్ సాంగ్ ఉంది. మనీ గురించి సెటైరిక్ గా సాగే సాంగ్స్ లో దానికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వొచ్చు. మనీ మనకే కాదు సమంతా అక్కినేనికి కూడా ముఖ్యమే.
అదే సంగతి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. సమంతా తాజా చిత్రం 'U టర్న్' సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంతా బిజీగా గడుపుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రశంసలు.. విమర్శలు.. వసూళ్ల గురించి మాట్లాడింది. "సినిమా అనేది బిజినెస్. ఎవరైనా లాభాలు రావాలని సినిమాలు తీస్తారు. సినిమాకు పేరొచ్చి వసూళ్లు రాకపోతే ఎందుకు? నాకు పేరు ముఖ్యం కాదు. వసూళ్లే ముఖ్యం. సినిమాకు డబ్బులు రావడమే ముఖ్యం" అని క్లారిటీ ఇచ్చేసింది.
అలా అని సమంతా తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడలేదు. సినిమాకు పేరు రావడం కన్నా డబ్బు రావడం ముఖ్యం అని చెప్పింది. తనకు షూటింగ్ లో లగ్జరీలకంటే మంచి సినిమాలో భాగం అవుతున్నానా లేదా అని ఆలోచిస్తానని ఈ సినిమా విషయంలో లగ్జరీల గురించి ఆలోచించకుండా సినిమా చేశానని చెప్పింది. "U టర్న్' మంచి సినిమా అనే విషయం తనకు తెలుసు అని.. కన్నడలో మొదట ట్రైలర్ రిలీజ్ కాగానే దర్శకుడు పవన్ కుమార్ కు ఫోన్ చేసి స్క్రిప్ట్ మెయిల్ చేయమని అడిగానని చెప్పింది. స్టొరీ నచ్చడంతో రీమేక్ లో నటించానని తెలిపింది.