స‌మంత 'శాకుంత‌లం' 2024లోనేనా?

Update: 2022-12-10 05:24 GMT
స‌మంత ప్ర‌ధాన పాత్రలో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'శాకుంత‌లం' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ గ‌త ఏడాదే పూర్త‌యింది.  చారీత్రాత్మ‌క నేప‌థ్యం గ‌ల క‌థ కావ‌డంతో సాంకేతికంగానూ  హంగులు జోడించాల్సి ఉంది. ఈ క్ర‌మంలో నిర్మాణానంతర ప‌నుల‌కు చాలా స‌మ‌యం ప‌ట్ట‌డం స‌హ‌జ‌మే. అయితే ఈ ప‌నులు కూడా ఎప్పుడో ప్రారంభ‌మ‌య్యాయి.

దాదాపు ఏడాది కాలం నుంచి అవి జ‌రుగుతున్నాయి. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే గ‌నుక ఇప్ప‌టికే ఆ పనులు పూర్తి చేసి రెడీగా ఉండాలి. కానీ తాజా ప‌రిస్థితుల చూస్తుంటే సినిమా విష‌యంలో జాప్యం క‌నిపిస్తుంది. శాకుంత‌లం గురించి మీడియాకి అప్డేట్ ఇచ్చి కొన్నినెల‌లు గ‌డుస్తోంది. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తయిన సంద‌ర్భంగా గుమ్మ‌డి కాయ కార్య‌క్ర‌మం  స‌మ‌యంలో అధికారిక స‌మాచారం వ‌చ్చింది.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. స‌మంత శాకుంతంల త‌ర్వాత క‌మిట్ అయిన సినిమాలు సైతం రిలీజ్ అయ్యాయి గానీ.... ఈసినిమా గురించి మాత్రం ఎక్క‌డా ఆమెకూడా రివీల్ చేయ‌లేదు. అడిగినా ఆ టాపిక్ ని స్కిప్ కొట్టేది. దీంతో శాకుంతలం సినిమా విష‌యంలో ఏం జ‌రుగుతోందా? అర్ధం కాని ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి.

ఈ చిత్రాన్ని గుణ‌శేఖ‌ర్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డే నిర్మాత కాదు. అంత‌కుముందు  అనుష్క‌తో  'రుద్ర‌మదేవి' చిత్రాన్ని నిర్మించి త‌న ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ ఏంటో చూపించారు. అలాంటి నిర్మాత బ‌డ్జెట్ లో రాజీ ప‌డే విష‌యంలో ఆలోచించ‌ర‌ని చెప్పొచ్చు.  ఆ న‌మ్మ‌కంతోనే శాకుంత‌లం ప్రాజెక్ట్ ని మొద‌లు పెట్టారు.

కానీ సినిమా ఆల‌స్య‌మవుతోన్న కొద్ది 'శాకుంత‌లం'ని ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. సినిమా గురించి అప్డేట్ లేదు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఏ స్టేజ్లో ఉన్నాయో క్లారిటీ   లేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న‌ది తెలియ‌దు. ఇవ‌న్నీ చూస్తుంటే 2023 లో కూడా శాంకుంతలం రిలీజ్ క‌ష్ట‌మే అన్న చ‌ర్చ ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.

అయితే  అప్ప‌ట్లో రుద్ర‌మదేవి సినిమా విష‌యంలోనూ ఇలాంటి స‌న్నివేశాలే క‌నిపించాయి. కానీ ఆ అంచ‌నాల్ని బ్రేక్ చేసి రుద్ర‌మ‌దేవిని రిలీజ్ చేసారు. అటుపై స‌క్సెస్ అలాగే క‌నిపించింది. మ‌రి శాకుంత‌లం విష‌యంలోనూ అలాంటి స‌ర్ ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారో? ఏమో  తెలియాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News