సినిమా కోసం ఏం చేయడానికైనా హీరోయిన్లు రెడీ అయిపోతున్నారు. ఒకప్పుడు కేవలం గ్లామర్ ఉంటే నెట్టుకొచ్చేయవచ్చు అనే ఫీలింగ్ ఉండేది. కాని ఇప్పుడు మాత్రం కామెడీ నుండి యాక్షన్ స్టంట్ల వరకు హీరోయిన్లు అన్నీ చేయాల్సిందే. చేసేస్తున్నారు కూడా. నిన్నటికి నిన్న హీరోయిన్ ఛార్మి ఒక ఫైటర్ చేసిన పొరపాటుతో ముఖం మీద హాకీ బ్యాట్‌తో కొట్టించేసుకుంది. ఇప్పుడు సమంత కూడా సేమ్ టు సేమ్ అలాగే తన్నులు తినేసింది.
చాలా రోజుల నుండి సమంత నేపాల్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తమిళ హీరో విక్రమ్‌తో 10 ఎంద్రాదుకుల సినిమా షూటింగ్‌లో అమ్మడు బిజీగా ఉంటోంది. ఓ నాలుగు రోజుల నుండి మాత్రం హైదరాబాద్‌లోనే మకాం వేసింది. ఎందుకంటే ఇక్కడ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ప్రమోషన్లు చేయడంలో బిజీగా ఉందిలేండి. ఇకపోతే అమ్మడు ఈరోజు ఉదయం ప్రమోషన్లకు వచ్చినప్పుడు చేతి కండపై ఓ గాయం కనిపించగా.. ఏంటమ్మాయ్ ఇది అంటే.. పెద్ద స్టోరీయే చెప్పింది. నేపాల్‌లో కేవలం రొమాంటిక్ సీన్లే కాదట, అక్కడ ఫైటింగులు కూడా చేస్తోందట.. ఆ క్రమంలో దెబ్బలు బాగా తగిలాయట. అయ్యో పాపం!!