నాగ్ మామ BB5 ఫినాలేలో సామ్ ఊఊ అంటావా?

Update: 2021-12-19 09:10 GMT
కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ - తెలుగు సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలే స్టేజ్ కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కొన్ని విమ‌ర్శ‌లు మ‌రికొన్ని పొగ‌డ్తల‌తో ఈ సీజ‌న్ కూడా దిగ్విజ‌యంగా ముగుస్తోంది. హౌస్ పార్టిసిపెంట్స్ ప్ర‌ద‌ర్శ‌న మునుప‌టి కంటే మెరుగ్గా ఉంద‌న్న టాక్ కూడా వ‌చ్చింది.

ఏదైతేనేం బిబి 5 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ తాజా ప్రోమ్ వ‌చ్చేసింది. ఇందులో ఆర్.ఆర్.ఆర్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కాగా.. బ్ర‌హ్మాస్త్ర స్టార్స్ ర‌ణ‌బీర్- ఆలియా భ‌ట్ స‌హా ప్ర‌త్య‌క్షం కాగా.. శ్రీ‌య న‌ర్త‌న‌ల‌తో అద‌ర‌గొట్టింది.  పుష్ప టీమ్ త‌ర‌పున‌ సుకుమార్ - ర‌ష్మిక కూడా గ్రాండ్ ఫినాలే వేదిక‌కు ఎటెండ‌య్యారు. సామీ స్టెప్ తో ర‌ష్మిక అద‌ర‌గొట్ట‌గా .. సుకుమార్ ఈ స్టెప్ వేయాలంటూ నాగ్ స‌ర‌దాగా న‌వ్వేసారు. ద‌బిడ దిబిడే! అంటూ బాల‌య్య డైలాగ్ తో ఆలియా వేడెక్కించింది. ఇక హౌస్ మేట్స్ ఆర్.ఆర్.ఆర్ ని మిస్స‌య్యాం అన‌గానే ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడో రిలీజైపోయింది! అంటూ రాజ‌మౌళి ఆట‌ప‌ట్టించారు.

మ‌రోవైపు నాని త‌న ఇద్ద‌రు భామ‌లు సాయిప‌ల్ల‌వి- కృతి శెట్టితో క‌లిసి శ్యామ్ సింగ‌రాయ్ గెట‌ప్ తో వేదిక‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. అత‌డు సూట్ కేస్ తో పాటే రావ‌డం విశేషం. కృతిని చూస్తూ నాగ్ ఒక‌టా రెండా? అంటూ నానీతో లిప్ లాక్ ల గురించి ప్ర‌శ్నించారు. ఆస‌క్తిక‌రంగా ఈ గ్రాండ్ ఫినాలే వేదిక‌పై ఊ అంటావా మామా ఊఊ అంటావా? అంటూ  పుష్ప నుంచి స్పెష‌ల్ నంబ‌ర్ ఓ ఊపు ఊపింద‌నే చెప్పాలి. పుష్ప‌లో ఈ పాట‌లో స‌మంత వేడెక్కించే స్టెప్పులు క‌ళ్ల ముందు క‌నిపించాయి. మాజీ మామ ఈవెంట్లో సామ్ స్పెష‌ల్ సాంగ్ హైలైట్ అవ్వ‌డం ఇక్క‌డ గొప్ప విశేషం.  జ‌గ‌ప‌తిబాబు గ్రాండ్ ఫినాలే కు అటెండ‌య్యారు. నాటు నాటు ఊర నాటు పాట‌కు బిబి గ‌త సీజ‌న్ విజేత రాహుల్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. మొత్తానికి బిబి5 సీజ‌న్ ఫైన‌ల్ లో ఇంకా ఎన్ని ప్ర‌త్యేక‌త‌లో టీవీలో లైవ్ లీగా చూడాల్సిందే.



Full View

Tags:    

Similar News