బ‌ర్త్ డే స్పెష‌ల్: గంగూబాయిని ఆకాశానికి ఎత్తేసిన సామ్!

Update: 2022-03-16 10:30 GMT
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియాభ‌ట్ ఇటీవ‌లే `గంగుబాయి క‌తియ‌వాడి`తో మ‌రో  బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఖాతాలో వేసుకుంది. గంగూబాయ్ గా  ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకుంటోంది. గంగూబాయి పాత్ర‌కి అలియా ప‌నికొస్తుందా? అని విమ‌ర్శించిన నోళ్లే ఇప్పుడు వెళ్ల‌బెట్టుకునేలా చేసింది.

గంగుబాయి పాత్ర‌లో అలియా ఒదిగిన విధానం ఆద్యంతం ఆక‌ట్టుకుంది. అలియా భ‌ట్ ఇమేజ్ ఇప్పుడు మార్కెట్ లో రెట్టింపు అయింది. గంగుబాయ్ తో ద‌క్కిన  క్రేజ్  అలియాభ‌ట్ రేంజ్ ఒక్క‌సారిగా మారింది. సీనియ‌ర్ హీరోయిన్ల స‌ర‌స‌న అలియాభ‌ట్ ని నిల‌బెట్టింది.

టాప్ టెన్ బెస్ట్ యాక్టెర్స్  న‌డుమ అలియా  ఒక‌రిగా వెలిగిపోతుంది. ఇక‌పై  యంగ్ హీరోయిన్ దృష్టిలో పెట్టుకుని మ‌రిన్ని బ‌యోపిక్ లు తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇలాంటి స‌క్సెస్ ఫుల్ మూవ్ మెంట్స్ న‌డుమ అలియాభ‌ట్ బ‌ర్త్ డేని నిన్న‌టి రోజున గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంది.

అలియాని గంగూబాయిగా అభివర్ణిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా విషెస్ తెలియ‌జేసారు. తాజాగా హీరోయిన్ స‌మంత అలియాభ‌ట్ కి ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.

త‌న ఇన్ స్టా స్టోరీస్ లో అలియా చిత్రాన్ని పోస్ట్ చేసి `హ్యాప్ బ‌ర్త్ డే. మీరు  చేయ‌లేనిది ఏదైనా ఉందా?`` అని అలియా ప్ర‌తిభ‌ని ప్ర‌శంసించింది. ``మీ స‌క్సెస్ ఫుల్ చిత్రాల్ని ఎంతో ఆస్వాదిస్తున్నాం. ఆ విజ‌యాల్ని మేము సెల‌బ్రేట్  చేసుకుంటున్నాం` అని అన్నారు. అలియా కెరీర్ లో ఎదుగుతోన్న వైనాన్ని ఈ ర‌కంగా స‌మంత మెచ్చుకుంది.

ఇక అలియాభ‌ట్ `ఆర్ ఆర్ ఆర్` సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో అలియా రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా న‌టించింది. ఇక బాలీవుడ్ లో `బ్ర‌హ్మ‌స్ర్త‌`..`డార్లింగ్స్`..`రాకీ ఔర్ రానీకి ప్రేమ్ క‌హానీ`లో న‌టిస్తోంది. అలాగే `హార్ట్ స్టోన్స్ `అనే ఇంగ్లిష్ చిత్రంలోనూ న‌టిస్తోంది.

మార్చి 25న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా విజ‌యం సాధిస్తే అలియాభ‌ట్ ఇమేజ్ పాన్ ఇండియాకి రీచ్ అవుతుంది.  కానీ రిలీజ్ కి ముందే అలియాభ‌ట్ టాలీవుడ్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న ఓ కొత్త చిత్రంలో అవ‌కాశం ద‌క్కించుకుంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇక బాలీవుడ్ లో అలియా కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సీనియ‌ర్ హీరోల నుంచి జూనియ‌ర్ హీరోల వ‌ర‌కూ అంద‌ర్నీ రౌండ‌ప్ చేస్తోంది.  త‌లుపు త‌ట్టిన ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు.
Tags:    

Similar News