అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం ఇంటికే పరిమితమై తన హస్బెండ్ నాగ చైతన్య తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తనకు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. తన పెట్ తో దిగిన ఫొటోలతో పాటు.. భర్త నాగ చైతన్యతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల సమంత తన వెజిటబుల్ గార్డన్ ను అభిమానులకు పరిచయం చేసింది. అర్బన్ కిసాన్ వారితో కలిసి తన ఇంటి టెర్రస్ మీద వెజిటబుల్ గార్డెన్ ను ఏర్పాటు చేసింది. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న సమంత ఆర్గానిక్ పద్ధతిలో వెజిటబుల్స్ పండించడం నేర్చుకున్నది. ఇక కొత్త వంటలను కూడా సమంత ఎంతో శ్రద్దగా నేర్చుకుంటోంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ టీచర్ ను కూడా నియమించుకుంది. ఇక సినిమా షూటింగ్స్ లేకపోయినా తన ఫిట్నెస్ మీద ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వర్కౌట్స్ చేస్తూ ఉంది. అంతేకాకుండా తన భర్తతో కలిసి యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది.
ఇప్పుడు తాజాగా సమంత యోగా చేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసింది. ''గార్డెనింగ్ కాకుండా.. నేను నిజంగా ఆనందిస్తున్నది యోగా. ఎందుకంటే చైతన్య అక్కినేని నేను కలిసి చేస్తున్నాం కాబట్టి... #mytimewithyou #couplesyoga.. అలాగే మాకు సూపర్ బెస్ట్ ట్రైనర్ సంతోష్ ఉన్నాడు. చెయ్ ఈ ఫొటోలో లేడు కానీ నేను దానిపై వర్క్ చేస్తున్నాను'' అని క్యాప్షన్ జత చేసింది. ఈ ఫొటోలో సమంత కేవలం తన రెండు చేతుల మీద బాడీ మొత్తాన్ని బ్యాలన్స్ చేసే యోగా భంగిమలో కనిపించింది. దీనిపై నెటిజన్స్ 'సూపర్ ఉమెన్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనిపై నమ్రత శిరోద్కర్, రకుల్ ప్రీత్ సింగ్, రుహనీ శర్మ,గుత్తాజ్వాలా వంటి వారు కూడా స్పందించింది. సమంత లేటెస్ట్ గా పెట్టిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.