సమంత ఎందుకంత స్వీటీయో ఇప్పుడు తెలిసింది..

Update: 2015-04-14 13:31 GMT
స్లిమ్‌ గా సొట్ట బుగ్గలతో కనిపించే సొగసరి సమంతా ఇప్పుడు తమిళ, తెలుగు ఇండస్ట్రీలను ఊపు ఊపుతోంది.  అభిమానులు ముద్దుగా స్వీటీ, నాటీ అని పిలుచుకునే ఆ స్వీటీ బ్యూటీకి షుగర్‌ ఉందట. అవును... మాకు తెలుసులే సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలో ఆమెకు డయాబెటిస్‌ ఉంది అనుకోవద్దు... నిజంగానే రెండేళ్ల కిందట వరకు ఆమెకు షుగర్‌ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉండేదట. ఇప్పుడు అదుపులోకి వచ్చిందట. స్వయంగా ఆమే ఈ సంగతి చెప్పారు.  

    %''''%నేను కూడా కొన్నాళ్ల క్రితం లో షుగర్‌తో బాధపడ్డాను. అయినా హీరోయిన్‌ ఎప్పుడూ అందంగా, అంతా పర్‌ఫెక్ట్‌గా కనిపించాలని లేదు కదా? అందుకే త్రివిక్రమ్‌ నా పాత్ర గురించి చెప్పగానే.. మరో మాట లేకుండా ఓకే చెప్పేశాను. స్వతహాగా ఆ పాత్రను నేను బాగా ఆస్వాదించా'' అంటోంది సమంత.

    సినిమాలో నేను డయాబెటిక్‌ అనేసరికే చాలామంది ఆశ్చర్యపోయారు. రెండేళ్ల క్రితం నాకు నిజంగానే సుగర్‌ లెవల్స్‌ తక్కువ స్థాయిలో ఉన్నాయి అని చెబుతూ డయాబెటిస్‌ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. యువత ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. అందులో డయాబెటిస్‌ కూడా ఒకటి... ఇది  సాధారణ విషయమే ధైర్యంగా ఉండండి అంటూ మోటివేట్‌ చేసింది. సన్నాఫ్‌ సత్యమూర్తి సక్సెస్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ అమ్మడు తనకు నిజంగానే డయాబెటిస్‌ ఉన్న సంగతి చెప్పింది. మొత్తానికి ఆరోగ్య సమస్య ఉన్నా అందం, అభినయంతో ప్రేక్షకుల మదిని దోచుకుని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకోవడం గ్రేటే మరి.

Tags:    

Similar News