జిమ్ ని విరిచేస్తున్న సామ్.. ఏంటీ క‌సి?

Update: 2022-01-08 09:44 GMT
కొంద‌రికి మెషీన్ లా ప‌ని చేయ‌డం అల‌వాటు. వృత్తికి అంకిత‌మై ప‌ని చేసే నాయిక‌ల జాబితాలో స‌మంత పేరు చార్ట్ లో టాప్ లో ఉంటుంది. ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నా కానీ ఫిట్నెస్ విష‌యంలో అశ్ర‌ద్ధ అన్న‌దే క‌నిపించ‌దు త‌న‌లో. సామ్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. జిమ్ యోగా సెష‌న్స్ కి గ్యాప్ ఇవ్వ‌డం అన్న‌ది త‌న కెరీర్ లోనే లేదు. సమంత వ‌ర్క‌వుట్ల విష‌యంలో వారాంతాల్లో కూడా ఆగదు. వారాంతంలో అందరూ విశ్రాంతి తీసుకున్నా కానీ... తన వారాంతపు వర్కవుట్ లతో స్ఫూర్తిని నింపేందుకు సమంత ప్ర‌య‌త్నిస్తుంది.

తాజాగా సమంత వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో లభ్యమవుతోంది. సామ్ తాజాగా వ్యాయామాన్ని పర్యవేక్షించే ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ కూడా కనిపిస్తారు.

సమంత త‌న కొలీగ్స్ కి ఫిట్ నెస్ గోల్స్ ఇస్తుంది. ఓవైపు వృత్తి ప‌రంగా మ‌రోవైపు ఫిట్నెస్ .. ఇంకోవైపు ఫ్యాష‌న్స్ పరంగా గోల్స్ సెట్ చేయ‌డం స‌మంత ప్ర‌త్యేక‌త‌. ఇటీవ‌లే ఊ అంటావా సాంగ్ తో ఓ ఊపు ఊపేసిన సామ్ అంత‌కుముందు ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 సిరీస్ లో రాజీ పాత్ర‌లో అంతే గొప్ప పేరు తెచ్చుకుంది. మునుముందు సామ్ కెరీర్ లైన‌ప్ అసాధార‌ణంగా ఉంది. వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడిదుడుకుల‌ను అధిగ‌మించేందుకు మ‌రింత‌గా బిజీ అయిపోతోంది.

ఫ్యామిలీమ్యాన్ -2` వెబ్ సిరీస్ తో సామ్ కి బాలీవుడ్ లో మంచి గుర్తింపు ద‌క్కింది. ఆ క్రేజ్ తోనే ఉత్త‌రాదిన అవ‌కాశాలు అందుకుంటోంది. ఇప్ప‌టికే తాప్సీ నిర్మాణ సంస్థ‌లో రెండు ప్రాజెక్ట్ ల‌కు సంత‌కం చేసింద‌ని ప్ర‌చారం సాగుతోంది. అలాగే ప‌లు  బిగ్ ప్రొడ‌క్ష‌న్ హస్ లు సామ్ తో ఒప్పందాలు చేసుకుంటున్నాయ‌ని తెలుస్తోంది.

సామ్ తొలిగా టాలీవుడ్ క‌మిట్ మెంట్ల‌ను పూర్తిచేయాల‌ని భావిస్తోంది. గ్యాప్ లో బాలీవుడ్ లో బిజీ అయ్యే  ప్లాన్స్ చేస్తోంది. అక్క‌డ దీపిక‌.. తాప్సీ వంటి ప్ర‌ముఖ నాయిక‌ల నిర్మాణ సంస్థ‌ల‌కు క‌మిట‌వుతోంది. త‌దుప‌రి
స‌మంత `ఫ్యామిలీ మ్యాన్ -2` వెబ్ సిరీస్ త‌ర్వాత రాజ్  అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `స్పిన్ ఆఫ్‌ సిటాడెల్ `అనే మ‌రో వెబ్ సిరీస్ కి క‌మిట్ అయింది. ఇందులో సామ్ గుఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. వ‌రుణ్ ధావ‌న్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఇది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్. ఇలా స‌మంత సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ జోరు చూపిస్తోంది. ఇక తెలుగులో ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ `శాకుంత‌లం` విడుద‌ల కావాల్సి ఉంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అలాగే `య‌శోద` అనే మ‌రో లేడీ ఓరియేంటెడ్ చిత్రంలోనూ స‌మంత‌ న‌టిస్తోంది. 







Full View


Tags:    

Similar News