సాయిధరమ్ మీద సమంత ప్రేమ

Update: 2016-05-05 15:30 GMT
సాయిధరమ్ తేజ్ తో సినిమాలేమీ చేయలేదు సమంత రూత్ ప్రభు. సమంత పక్కన హీరోగా నటించే స్థాయికి సాయిధరమ్ ఇంకా ఎదగలేదు కూడా. ఐతే ఈ రోజు ‘సుప్రీమ్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మెగా మేనల్లుడిని ఉద్దేశించి సమంత చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది.

‘‘సాయిధరమ్ తేజ్.. నీ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ మై స్టార్’’ అంటూ లవ్ సింబల్ కూడా యాడ్ చేసి ట్వీట్ పెట్టింది సమంత. సాయిధరమ్‌ ను ‘స్టార్’గా గుర్తించి.. అతడి మీద సమంత ఇంత ప్రేమ కురిపించేయడం విశేషమే. సమంత ట్వీట్ చూసి ఉప్పొంగిపోయిన మెగా మేనల్లుడు.. ‘‘థ్యాంక్ యు సో మచ్. ఇది నాకు చాలా చాలా స్పెషల్ ట్వీట్’’ అని రిప్లై ఇచ్చాడు. భవిష్యత్తులో వీళ్లిద్దరూ కలిసి సినిమా ఏమైనా చేస్తారేమో చూడాలి. సమంత-సాయిధరమ్ ముచ్చట్ల సంగతి పక్కనబెడితే.. ఈ రోజు రిలీజైన ‘సుప్రీమ్’కు మంచి టాకే వచ్చింది.

అనిల్ రావిపూడి ‘పటాస్’ స్థాయిలో కాకపోయినా ఓ మోస్తరుగా అనిపించే పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్ అందించాడు. కామెడీ సినిమాకు మేజర్ హైలైట్‌ గా నిలుస్తోంది. సాయిధరమ్ పెర్ఫామెన్స్ కు కూడా మంచి రెస్పాన్సే వస్తోంది. గత ఏడాది ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో ఏవరేజ్ సక్సెస్ అందుకున్న సాయిధరమ్-దిల్ రాజు కాంబినేషన్ ఈసారి ఇంకొంచెం పెద్ద సక్సెసే దక్కించుకునేలా ఉంది. దిల్ రాజు బేనర్లో సాయిధరమ్ వరుసగా చేసిన మూడో సినిమా ఇది.
Tags:    

Similar News