కాజల్ తమన్నా సాంబార్ చట్నీ

Update: 2019-05-11 06:06 GMT
ఇద్దరు హీరోయిన్లు ఫ్రెండ్స్ గా ఉండలేరని చాలామందికి నిశ్చితాభిప్రాయం. ఫ్రెండ్స్ గా ఉండాలంటే అసూయ అడ్డు వస్తుందని.. అసూయ లేకుండా ఆడవాళ్ళు ఉండరని పాతచింతకాయపచ్చడి ఫైలాసఫి చెప్తారు.  అలాంటివారికి కాజల్ అగర్వాల్.. తమన్నా భాటియాల ఫ్రెండ్ షిప్ చూపిస్తే గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది.

కాజల్.. తమన్నా ఇద్దరూ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదిహేనేళ్ళు అయింది.  ఇద్దరూ పలు సందర్భాలలో కలిసి స్టేజ్ మీద కనిపించారు. తాజాగా మరోసారి అలాంటి సందర్భమే వచ్చింది. నిన్న ఇద్దరూ కలిసి చెన్నైలో ఒక ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటో షూట్ లో జస్ట్ ఫోటోలు మాత్రమే దిగకుండా కాలేజీలో స్టూడెంట్స్ మాట్లాడుకునేలా గలగలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు.

ఇద్దరూ కలిసి క్లోజ్ గా అక్క చెల్లి లాగా పోజిస్తుంటే అక్కడ ఉన్న లేడీ ఫోటోగ్రాఫర్ ఇద్దరూ కలిసి 'గర్ల్ ఫ్రెండ్స్' టైటిల్ తో ఒక సినిమా చేయవచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో తమన్నా "ఇదేదో తేడాగా అనిపిస్తోందే" అంటూ నవ్వేసింది.  కాజల్ వెంటనే అందుకొని 'విక్కీ క్రిస్టీనా బార్సిలోనా' సినిమా తీయాలని చెప్పింది. అయితే అది క్లాస్ గా ఉండడం తో తమన్నా "కాజల్ నీ ఐడియాస్ మరీ హాలీవుడ్ స్టైల్ లో ఉన్నాయి. కాస్త లోకల్ స్టైల్ లో మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఉండేలా చెప్పమ్మా" అంటూ సలహా ఇచ్చింది.  దీంతో 'సాంబార్ చట్నీ అయితే బాగుంటుంది అని కాజల్ ఒక టైటిల్ చెప్పింది.

ఈ వీడియోను తన ఇన్స్టా ఖాతాద్వారా పోస్ట్ చేసిన తమన్నా నెటిజనులను తమ సినిమాకు టైటిల్స్ చెప్పమని కోరింది. ఒక నెటిజనుడు "పాలు.. నీరు" అన్నాడు.. మరొకరు.. "స్నో వైట్ బార్బీ డాల్" అన్నారు. ఇంకొకరు.. మిల్కీ సిల్కీ అన్నారు.  మరొకరికి మాత్రం ఇద్దరినీ చూడగానే హిమేష్ రేషమ్మియా గుర్తొచ్చాడు... "ఆషిక్ బనాయా... ఆషిక్ బనాయా.. ఆప్ నే" అంటూ పాటందుకున్నాడు. 

For Video Click Here


Tags:    

Similar News