దేవ‌ర‌కొండ‌తో కిస్సుల‌కు ఓకే.. అఖిల్ తోనూ..!

Update: 2020-12-10 13:05 GMT
ఆహా-తెలుగు ఓటీటీ స‌క్సెస్ బాట‌లోకి రావ‌డానికి అల్లు బాస్ అర‌వింద్ ఎంత‌గా అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారో తెలిసినదే. ఒరిజిన‌ల్ కంటెంట్ కోసం ప‌క్కా పెట్టుబడుల‌తో బ‌రిలో దిగి ఓటీటీ వేదిక‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇరుగు పొరుగు భాష‌ల సినిమాల్ని విరివిగానే ఓటీటీలో అందిస్తున్నారు. దీంతో ఆహా కు స‌బ్ స్క్రైబ‌ర్లు పెరుగుతున్నారు.

ఇక ఈ వేదిక‌పై సామ్ జామ్ పెద్ద స‌క్సెస‌వుతోంది. రెగ్యుల‌ర్ గా టాప్ సెల‌బ్రిటీల‌తో సామ్ ఇంట‌ర్వ్యూలు హైలైట్ అవుతున్నాయి. తాజాగా మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నాతో సామ్ జామ్ కార్య‌క్ర‌మం కొత్త ఎపిసోడ్ ఈనెల 11న లైవ్ కి రానుంది.

ఈలోగానే రిలీజైన ప్రోమో యూత్ లోకి దూసుకెళ్లింది. అన్న‌ట్టు స‌మంత అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చిన మిల్కీ త‌న‌కు దేవ‌ర‌కొండ‌ను ఆన్ స్క్రీన్ కిస్ చేయాల‌నుంద‌ని ఓపెన్ గానే చెప్పేసింది. ఒకవేళ నో కిస్సింగ్ ఆన్ స్క్రీన్ బ్రేక్ రూల్ చేస్తే దేవ‌రకొండ‌తో ఓకేన‌ని చెప్పింది త‌మ‌న్నా.

అఖిల్ కొంచెం యంగ్ అయిపోయాడు కానీ! అంటూ సమంత స‌ముదాయిస్తుంటే... లవ్ కి ఏజ్‌తో సంబంధం లేదు అంటూ జోష్ చూపించింది తమన్నా. నీక్కావాలంటే అఖిల్‌తో మీటింగ్ అరేంజ్ చేస్తా అంటూ సామ్ క‌వ్వించ‌గా.. అఖిల్ ఫాదర్ ‌తో కూడా మాట్లాడతావా.. అంటూ తమన్నాని ఆటపట్టించారు మ‌రి. తాజా ప్రోమోలో నందిని రెడ్డి క‌నిపించారు. ఇక త‌మ‌న్నాకు స్టంట్స్ నేర్పిస్తున్న కోమ‌ల్ షాలినిల‌కు చెరో ల‌క్ష చెక్ ని అంద‌జేయ‌డం విశేషం. త‌మ‌న్నా ప్ర‌స్తుతం సీటీమార్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సీజ‌న్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.youtube.com/watch?v=oPCwzprsHsk
Tags:    

Similar News