700మంది ఆడిషన్.. సంపత్ నంది కష్టం మామూలుగా లేదుగా

Update: 2021-08-27 09:30 GMT
ఒక సినిమా కోసం కొత్తగా ఒకరిని ఇద్దరిని తీసుకోవడం రివాజు. ఒక పాత్ర కోసం ఐదు మందినో.. 10మందినో ఆడిషన్ చేస్తారు. కానీ మన తెలుగు దర్శకుడు ఏకంగా 700 మందిని ఆడిషన్ చేసి అందులోంచి 24 మందిని ఎంపిక చేసుకున్నాడు. ఇక అంతటితో ఈ కష్టం అయిపోలేదు. అందులో వారికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చాక సినిమా మొదలుపెట్టాడు.

ఈ కథ అంతా ‘సిటీమార్’ చిత్రం కోసం దర్శకుడు సంపత్ నంది పడ్డ కష్టాలివీ.. ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో సాగుతుంది. హీరో గోపీచంద్ ఇందులో కబడ్డీ జట్టు కోచ్ గా నటించాడు. ‘ప్రో కబడ్డీ’ లీగ్ చూశాక సంపత్ నంది ఈ కథను రాసుకున్నాడట.. ఈ సినిమా కథలో భాగంగా కబడ్డీతోపాటు నటన వచ్చిన అమ్మాయిల కోసం ఏకంగా 700 మంది ఆడిషన్ చేశాడట.. కానీ చాలా మందికి కబడ్డీ తెలియకపోవడంతో కొంతమంది కబడ్డీ జాతీయ స్థాయి ప్లేయర్లను తీసుకున్నాడట.. వీరికి నటనలో శిక్షణ ఇప్పించి.. మరికొందరు అమ్మాయిలకు కబడ్డీలో శిక్షణ ఇప్పించి అలా మొత్తం అయిపోయాక సినిమా తీశాడట సంపత్ నంది.

నటన, కబడ్డీ రెండూ వచ్చిన వారిని అవగాహన ఉన్న వారిని వెతికి పట్టుకోవడం చాలా కష్టమైందని సంపత్ నంది చెబుతున్నాడు. ఈ సినిమాలో జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడిన నలుగురు అమ్మాయిలను కూడా తీసుకొని నటనలో శిక్షణ ఇప్పించి నటింప చేశారట..

‘సీటీమార్’ ఒక స్పోర్ట్స్ డ్రామానే కాదు.. ఒకయాక్షన్, ఎమోషనల్ మూవీ కూడా అని సంపత్ నంది అంటున్నాడు. తన కెరీర్ లోనే ఏ సినిమాకు పడనంత కష్టం ఈ సిటీమార్ కు పడినట్లు ఆయన తెలిపాడు. సినిమాను ఓటీటీకి ఇవ్వకుండా థియేటర్లో రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఇన్నాళ్లు ఆగామని తెలిపారు. మరి ఈ సినిమా ఎలా వచ్చిందో మనం తెరమీద చూడాల్సిందే.
Tags:    

Similar News