ప‌వ‌న్ ఇంప్రెస్ చేయ‌డానికే ఆ టైటిల్..!

Update: 2016-10-27 09:37 GMT
ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది గుర్తుండే ఉంటాడు... రామ్ చ‌ర‌ణ్ తేజ‌తో ‘ర‌చ్చ‌’ అనే మాస్ హిట్ ఇచ్చాడు. ఆ త‌రువాత‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా ‘గ‌బ్బ‌ర్ సింగ్ -2’ కోసం ఏకంగా రెండు సంవ‌త్స‌రాలు ఎదురు చూశాడు. ఆ మేర‌కు స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు. అయితే, చివ‌రాఖ‌ర‌కి వ‌చ్చేస‌రికి... గ‌బ్బ‌ర్ సింగ్ -2 నుంచి సంప‌త్ నంది త‌ప్పుకున్నాడు. ప‌నితీరుపై న‌మ్మ‌కం కుద‌ర‌క‌పోవ‌డంతోనే ప‌వ‌న్ క‌ల్యాణే అత‌డిని త‌ప్పించాడ‌ని కూడా అప్ప‌ట్లో క‌థ‌నాలు వచ్చాయి. ఏదైతేనేం సంప‌త్ కెరీర్ లో రెండేళ్ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వాహా చేశార‌ని అనుకోవాలి. అయితే, ఆ ఫీలింగ్ ఏమాత్రం లేకుండా... త‌న అభిమాన హీరో ఎప్ప‌టికైనా అవ‌కాశం ఇవ్వ‌క‌పోతాడా అని ఎదురుచూస్తున్నాడీ ద‌ర్శ‌కుడు. ఆ త‌రువాత ర‌వితేజ‌తో ‘బెంగాల్ టైగ‌ర్’ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తాజాగా గోపీచంద్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

అయితే, అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్నామ స్మ‌ర‌ణ చేస్తూనే ఉన్నాడీ ద‌ర్శ‌కుడు. బెంగాల్ టైగ‌ర్ లో ఒక రేంజిలో ప‌వ‌ర్ స్టార్ భ‌జ‌న చేశాడ‌నే చెప్పాలి! ఆ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చాలా గొప్ప‌లు చెబుతూ వ‌చ్చాడు. ఇప్పుడు గోపీచంద్ సినిమా విష‌యంలో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ నామస్మ‌రణ‌ను సంప‌త్ వదులుకోవ‌డం లేద‌ని అనిపిస్తోంది. ఎందుకంటే, ఈ చిత్రానికి ‘ఆరడుగుల బుల్లెట్‌’ అనే టైటిల్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో సూప‌ర్ హిట్ అయిన పాట‌లోని ప‌ల్ల‌వి లైన్ అది. నిజానికి, ఈ టైటిల్ ను వ‌రుణ్ తేజ్ కోసం అని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి! ఇప్పుడీ పేరును గోపీచంద్ చిత్రం కోసం సంప‌త్ నంది తీసుకున్న‌ట్టు చెబుతున్నారు! టైటిల్ ద‌గ్గ‌ర నుంచే ప‌వ‌న్ నామస్మ‌ర‌ణ మొద‌లైందీ అంటే... ఇక ఈ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ను ఏ రేంజిలో మోసేస్తాడో చూడాలి. మ‌రి, ఈ ర‌కంగానైనా ప‌వ‌న్ ను సంప‌త్ నంది ఇంప్రెస్ చేయ‌గ‌లుగుతాడా..? అభిమాన హీరోను డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇత‌డికి ఎన్న‌టికి ద‌క్కేనో మ‌రి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News