మాస్ మహరాజ్ రవితేజ నటించిన బెంగాల్ టైగర్ థియేటర్లలోకి వచ్చేస్తోంది. ట్రైలర్ లో ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్న రవితేజ ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బెంగాల్ టైగర్ స్టోరీ - రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బెంగాల్ టైగర్ కు సంపత్ నంది డైరెక్టర్. ఈ మూవీని స్టార్ట్ చేసే ముందు.. దాదాపు రెండేళ్లపాటు పవన్ తో అసోసియేట్ అయ్యాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా ఇంటర్వ్యూ లు ఇస్తూ అప్పటికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పాడు సంపత్ నంది. తనే ఓ స్టోరీ తీసుకెళ్లి పవన్ కి చెప్పానని, అయితే.. పవర్ స్టారే స్టోరీ ఇచ్చి డైరెక్ట్ చేయమన్నాడని అన్నాడు. ఆ తర్వాత తప్పుకోవాల్సి వచ్చింది.
పవన్ దగ్గర నుంచి పక్కకి వచ్చాక మూడే రోజుల్లో రవితేజతో మూవీ స్టార్ట్ చేసేశాడు సంపత్ నంది. అంటే.. ముందుగా పవన్ కోసం రాసుకున్న స్టోరీనే ఇప్పుడు రవితేజతో తెరకెక్కించాడమో అన్నది పవన్ ఫ్యాన్స్ అలోచన. పవన్ కి రాసిన డైలాగ్స్ రవితేజతో చెప్పించే ఛాన్స్ లేకపోయినా.. స్టోరీ మాత్రం ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.