'సీటీ మార్' అనబోతున్నాడు

Update: 2017-10-09 13:30 GMT
ఏమైంది ఈ వేళా సినిమాతో ఆకర్షించి రచ్చ సినిమాతో తనను తాను నిరుపించుకున్న దర్శకుడు సంపత్ నంది.. ఆ తర్వాత బెంగాల్ టైగర్ మూవీతో పర్వాలేదు అనిపించాడు. అయితే అతను ఎన్నో ఆశలు పెట్టుకొని చాలా కష్టపడి తీసిన గౌతమ్ నంద మాత్రం ఉహించని పరాజయాన్ని ఇచ్చింది. హీరో గోపీచంద్ కి కూడా ఆ సినిమా ఏ మాత్రం లాభాన్ని ఇవ్వలకేపోయింది.

అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తన బ్యానర్ లోనే ఒక సినిమాను తియ్యడానికి రెడీ అయ్యాడు సంపత్ నంది. 2014లో సంపత్ నంది టీమ్ వర్క్స్ ప్రొడక్షన్ ని స్థాపించి గాలిపటం అనే సినిమాను నిర్మించిన సంపత్ ఇప్పుడు మళ్లీ అదే బ్యానర్ లో ఒక వెరైటీ సినిమాను తియ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. సిటిమార్ అనే టైటిల్ ను కూడా రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే ఆయన ప్రొడక్షన్ లో తెరకెక్కించిన గాలిపటం సినిమా అంతగా ఆడలేదు. ఆది అందులో హీరోగా నటించాడు. ఇప్పుడు సరికొత్త తారాగణంతో సిటిమార్ సినిమాను తియ్యాలని సంపత్ హార్డ్ వర్క్ చేస్తున్నాడట. మరి ఈ సినిమాతో సంపత్ మళ్లీ గాడిలో పడతాడో లేదో చూడాలి           

మరో విషయం ఏంటంటే.. బెంగాళ్‌ టైగర్ అండ్ గౌతమ్ నంద అనేవి పవన్ కళ్యాణ్‌ కు రిఫరెన్స్ ఉన్న పేర్లు. ఈ సీటీమార్ అనేది మొన్ననే వచ్చిన అల్లు అర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలోని ఒక హిట్ సాంగ్. ఇలా మార్చి మార్చి మెగా రిఫరెన్సులతో టైటిళ్లు ఎందుకు పెడుతున్నాడో సంపత్ కే తెలియాలి.
Tags:    

Similar News