సంపూర్ణేష్ బాబు అకా సంపూ... ఈ పేరు చెబితే చాలు ప్రజల ముఖంలో నవ్వులు పువ్వులు పూస్తాయి. అగ్రహీరోలు, టాప్ కామెడీ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న ఈ కామెడీ లెజెండ్ ఇప్పుడు ఏపీ ప్రజల పాలిట రియల్ హీరో అనిపించుకున్నాడు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో పాలక పార్టీలు పిల్లి మొగ్గులు వేస్తున్న తరునంలో నిర్భయంగా, నిజాయతీగా ఆయన తన మనోభావాలను వెల్లడించారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కుండ బద్దలు కొట్టేశారు.. ఇంతా చేస్తే ఆయన ఎక్కడి వారో తెలుసా. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి కొట్లాడి విడిపోయిన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన, ఆయన స్వస్థలం మెదక్ జిల్లా సిద్ధిపేట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తెలంగాణ హీరో. కానీ.. మంచి మనసుతో ఆయన ఏపీ ప్రత్యేక హోదా కోసం తన గళం విప్పుతున్నారు.
పలువురికి చేతనైన సహాయం చేస్తూ, అందరి మన్ననలు అందుకుంటున్న హీరో సంపూర్ణేష్ బాబు ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు. అంతేకాదు ప్రత్యేక హోదాకు మద్దతుగా తన ఫేస్ బుక్ కవర్ ఫొటోను మార్చేశాడు. ఈ నెల 26న విశాఖలోని ఆర్కే బీచ్ లో తలపెట్టిన ప్రత్యేక హోదా సాధన దీక్షకు మద్దతు పలికాడు.
కాగా మరో తనీష్ కూడా ప్రత్యేక హోదాకు మద్దతుగా నిలిచాడు. ప్రత్యేక హోదాకు సంపూ మద్దతు పలకడంతో... ఏపీ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంపూను చూసైనా ఇతర హీరోలు స్పందించాలని కోరుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రముఖులంతా మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. హ్యాట్సాఫ్ సంపూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/