కేవలం 'క్లాస్ర్టోఫోభియా' వల్లే వచ్చాను

Update: 2017-09-06 10:23 GMT
ప్రస్తుత రోజుల్లో చాలా మంది నటీనటులు అందరిలా ఉండడానికి ఇష్టపడటం లేదు. ఎవ్వరు ఊహించలేని స్టైల్ లో సినిమాను తీసి ఒకే ఒక్క సినిమాతో సెలబ్రెటీ హోదాను అందుకుంటున్నారు. అలాంటి వారిలో సంపూర్ణేష్ బాబు ఒకరు. సినిమానే పెద్ద అబద్దం. అలాంటిది తెర వెనుక పడ్డ కష్టాన్ని బాధను దాచిపెట్టి  సంతోషం అనే అబద్దాలతో హృదయ కాలేయం సినిమాను జనాల్లోకి తీసుకెళ్లి మంచి హిట్ అందుకున్నాడు. అంతే కాకుండా బర్నింగ్ స్టార్ అని పేరును కూడా సంపాదించుకున్నాడు.

అయితే అతను తెలుగులో తొలిసారి వచ్చిన బిగ్ బాస్ షోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తన ఎంట్రీతో సంపూ అందరిని ఆకట్టుకున్నాడు. అయితే గడిచిన కొన్ని రోజులకే బిగ్ బాస్ షోలో అతనికి ఉండాలనిపించలేదు. కోపంతో రెచ్చిపోయాడు. చివరికి బాధతో ఏడ్చి షో నుండి నిష్క్రమించాడు. అయితే బిగ్ బాస్ షో నుండి వెళ్లిన తర్వాత సంపూ ఒక్కసారి కూడా మీడియా కంట పడలేదు. ఎట్టకేలకు ఓ టివి ఛానల్ కు రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బిగ్ బాస్ షో పరిణామాలను గురించి చెప్పుకున్నాడు. సంపూ మాట్లాడుతూ.. ''ఎప్పుడు బయటి ప్రపంచంలో ఆనందంగా జీవించే తనకు బిగ్ బాస్ హౌస్ లో రోజులు గడిచిన కొద్దీ మెంటల్ గా చాలా డిస్ట్రబ్ అయ్యాను. ఇంట్లోవాళ్ళని చాలా మిస్ అయ్యాను. వాళ్లకు ఎదో అవుతోంది అన్నట్టుగా ఉండేది. అక్కడ ఉండడం నా వల్ల కాలేదు'' అన్నాడు. అయితే బిగ్ బాస్ షోకి వెళితే ఇంకా పాపులర్ అవుతాననే ఆశ కూడా ఉండేదని అందుకే వెళ్లానని చెప్పాడు.  కానీ ముందే "హృదయ కాలేయం" దర్శకుడు స్టీవెన్ శంకర్.. ఈ షో గురించి చాలా చెప్పారు ఒక్కసారి హౌస్ లోకి వెళితే మళ్లీ రాలేవు చాలా కష్టం. ఒక్కసారి ఆలోచించుకోమని కూడా చెప్పారని సంపూ వివరించాడు.

ఇక తాను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా అనేక విమర్శలు వచ్చాయని చెప్పాడు. అయితే ఆ షో నుండి పిరికితనంతోనో మరో కారణం చేతనో వెళ్లలేదని కేవలం నేను బయటకు రావడానికి కారణం "క్లాస్ర్టోఫోభియా" అని చెప్పాడు. నాలుగు గదుల మధ్యన ఉండాలంటే వేసే భయాన్ని క్లాస్ర్టోఫోభియా అంటారులే.  అలాగే బిగ్ బాస్ షో నుండి బయటకు రాగానే కొన్ని మీడియా సంస్థలు లక్ష రూపాయలు జరిమానా మరియు ఆత్మహత్య వంటి ప్రయత్నాలు జరిగాయని ప్రసారం చేశారని.. వాటిలో వాస్తవం లేదని సంపూ తెలిపాడు.
Tags:    

Similar News