‘హృదయ కాలేయం’ సినిమాతో ఊహించిని స్థాయిలో పాపులారిటీ సంపాదించాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఆ తర్వాత అతను నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు కానీ.. సంపూ లేటెస్ట్ మూవీ ‘కొబ్బరి మట్ట’ మీద మాత్రం జనాల్లో బాగానే ఆసక్తి ఉంది. గత ఏడాది దాదాపు మూడు నిమిషాల నిడివితో.. ఒక లెంగ్తీ డైలాగ్ తో రిలీజ్ చేసిన ‘కొబ్బరి మట్ట’ టీజర్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐతే ఆ తర్వాత ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా గురించి అప్ డేట్స్ బయటికి వస్తున్నాయి. సినిమా షూటింగ్ పూర్తి కావచ్చిందట. ఏప్రిల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
ఈ నేపథ్యంలో ‘కొబ్బరి మట్ట’ సంపూ చేస్తున్న ఆండ్రాయిడు పాత్రకు సంబంధించిన లుక్ ఒకటి బయటికి వదిలారు. అందులో సంపూ షాకింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. చిత్రమైన హేర్ స్టైల్.. జిగేల్ జిగేల్ డ్రెస్సులో భలే హుషారుగా ఉన్నాడు సంపూ. ఈ చిత్రంలో సంపూ ఇంకో రెండు పాత్రలు కూడా చేస్తున్నాడు. ఒకటి పాపారాయుడు.. ఇంకోటి పెదరాయుడు. ‘హృదయ కాలేయం’ తరహాలోనే ఇది కూడా సెటైరికల్ మూవీనే. సంపూ తొలి సినిమాను రూపొందించిన స్టీఫెన్ శంకర్ ఈ చిత్రానికి కథ.. మాటలు అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రొనాల్డ్ రూపక్ సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ‘హృదయ కాలేయం’ తరహాలోనే ఇది కూడా సర్ప్రైజ్ హిట్టవుతుందేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/