సొసైటీ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ డ్ గా ఉన్నప్పటికీ హీరోయిన్లు ఇంటిమేట్ సీన్లు చేస్తుంటే.. ఆమె తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉంటారని అనుకోలేం. ఆ మాటకొస్తే సన్నీ లియోన్ తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ఇబ్బంది పడ్డవాళ్లే. తాను పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లడం పట్ల తన పేరెంట్స్ ఎంతో ఆవేదన చెందారని సన్నీ ఇంతకుముందే ప్రకటించింది. ఫారిన్లో పుట్టి పెరిగిన సన్నీ సంగతే అలా ఉంటే.. ఇండియన్ హీరోయిన్ల విషయంలో వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉండరు. ఈ విషయంలో తన పేరెంట్స్ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు బాలీవుడ్ భామ సనా ఖాన్ తెలిపింది. తెలుగులో ‘కత్తి’ సినిమాలో మెరిసి మాయమైన సనా.. హిందీలో ‘వజా తుమ్ హో’ అనే సినిమా కోసం ఓ రేంజిలో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.
అందులో ముద్దు సీన్లు.. సెక్స్ సీన్లకు కొదవే లేదు. బోల్డ్ సీన్లతో చాలామంది హీరోయిన్లకు సవాల్ విసిరింది సనా. ఐతే ఈ సినిమా విషయంలో తన తల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని సనా తెలిపింది. తనను సినిమాలో అలా చూపించాల్సిన అవసరం ఉందా అని దర్శకుడితో తన తల్లి గొడవ కూడా పడినట్లు సనా తెలిపింది. హాట్ హాట్ సీన్లలో నటించడంపై తన తల్లిని ఒప్పించడానికి చాలా కష్టమైందని సనా చెప్పింది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇది ఇబ్బందికర పరిస్థితే అని ఆమె తెలిపింది. వెండితెర మీద కూతురు బట్టలు విప్పితే ఏ తల్లిదండ్రులైనా ఊరుకుంటారా అని ప్రశ్నించిన సనా.. తన కుటుంబం నుంచి కూడా అలాంటి అభ్యంతరాలే వ్యక్తమయ్యాయంది. బాలీవుడ్లో ఇలాంటివి సాధారణమేనని.. విశాల దృక్పథంతో వీటిని ఆమోదించాలని చెప్పడంతో తన తల్లిదండ్రులు అర్థం చేసుకున్నట్లు తెలిపింది. తాను శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు షూటింగ్ స్పాట్లో డైరెక్టర్.. కెమెరామన్.. ట్రాలీ బాయ్ తప్ప ఎవరూ ఉండకుండా చూసుకున్నట్లు తెలిపింది. అయినప్పటికీ ఈ సన్నివేశాలు చేసేటపుడు ఇబ్బంది పడ్డానని.. శృంగార సన్నివేశాల్లో నటించడ నీకు చేత కాదా అని డైరెక్టర్ ఓసారి తన మీద అరిచినట్లు ఆమె తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/