నిజ జీవిత కథలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ ఆసక్తి చూపిస్తుంటారు. ఆ కథలను తెరపై చూపించడంలోనూ ఆయన శాలిని సాక్షాత్కరిస్తుంది. రక్త చరిత్ర సినిమానే వెండితెర సాక్షిగా ఆయన శైలికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇన్నాళ్ళకు మళ్ళీ నిజ జీవిత కథతో ఆయన చనిపోయిన వీరప్పన్ ను 'కిల్లింగ్ వీరప్పన్'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఒక్క విషయం చూస్తుంటే మాత్రం నిజంగా వీరప్పన్ వచ్చినట్టే వుంది. కొద్దిరోజుల క్రితమే చిత్రీకరణ మొదలెట్టిన ఈ సినిమాలో వీరప్పన్ పాత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఆ పాత్రలో నటిస్తున్న సందీప్ భరద్వాజ్, అచ్చుగుద్దినట్టు వీరప్పన్ లానే వున్నాడు. వీరప్పన్ ని చంపినపుడు తన సినిమా కోసం వర్మ దాచేశారా అనే అనుమానం వస్తుంది - ఆ పాత్రలో సందీప్ భరద్వాజ్ ని చూస్తుంటే. సందీప్ భరద్వాజ్ ఢిల్లీలో థియేటర్ ఆర్టిస్ట్. వీరప్పన్ గెటప్ లో పొరపాటున పోలీసుల కంట పడితే కాల్చినా కాల్చేస్తారు. కవల పిల్లల్లా వున్నారంటే నమ్మి తీరాల్సిందే.