తెలుగులో మంచి టైటిలే దొరకలేదా?

Update: 2017-05-06 05:18 GMT
తెలుగు ప్రేక్షకులకు తెలుగంటే పెద్దగా ఇష్టం లేదని అనుకుంటారో.. లేదంటే తెలుగులో ఎలాంటి టైటిల్ పెట్టినా చెల్లిపోతుందిలే అనే ఫీలింగో తెలియదు కాని.. కొందరు మాత్రం తెలుగు టైటిల్స్ ఘోరంగా పెడుతుంటారు. ఒక్కోసారి వేరే బాషలో మంచి టైటిల్ ను పెట్టినా.. తెలుగులో దానిని కూనీ చేసేస్తుంటారు.

ఈ మధ్యకాలంలో రీమేక్ లేదా డబ్బింగ్ సినిమాలను చూసుకుంటే.. రెండు చోట్లా టైటిల్ ఒకటే ఉండేలా చూస్తున్నారు. ప్రేమమ్ సినిమాను ఇక్కడ కూడా అదే టైటిల్ ఉండేలా చూసుకున్నారు. అలాగే విక్రమ్ ఇరుమగన్ సినిమాను ఇంకొక్కడు అన్నారు. సింగం సిరీస్ కు సింగం పేరునే యముడితో కలిపి తగిలించారు. కాని ఫ్లాపులతో ఊపిరాడక సతమతమవుతున్న సందీప్ కిషన్ మాత్రం.. తన ''మాయవన్'' సినిమా విషయంలో కాస్త వింతైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ తమిళ సినిమాకు తెలుగులో ''ప్రాజెక్ట్ Z'' అనే పేరును ఖరారు చేశారట. ఇంతకంటే మంచి టైటిల్ దొరకలేదా బాసూ? మాయలోడు.. మాయగాడు.. ఇలాంటివేం సెట్టవ్వలేదంటారా?

పిజ్జా వంటి సినిమాను ప్రొడ్యూస్ చేసిన సివి ఆనంద్.. ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో హీరోయిన్ లావణ్య త్రిపాఠి తొలిసారి సందీప్ కిషన్ తో జతకడుతోంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News