మహేష్‌ తో మూవీ.. ఇప్పుడే చెప్పలేనన్న సందీప్‌

Update: 2019-06-04 09:34 GMT
ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. టాలీవుడ్‌ లో 'అర్జున్‌ రెడ్డి' చిత్రాన్ని తెరకెక్కించి సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న సందీప్‌ వంగ ఒక్క సినిమాతోనే ఇండియా వ్యాప్తంగా ఫేమస్‌ అయ్యాడు. ప్రస్తుతం ఈయన అర్జున్‌ రెడ్డిని హిందీలో 'కబీర్‌ సింగ్‌' గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు. షూటింగ్‌ పూర్తి చేసిన సందీప్‌ వంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతూ మరో వైపు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్బంగా మహేష్‌ బాబుతో మూవీపై క్లారిటీ ఇచ్చాడు.

అర్జున్‌ రెడ్డి విడుదలైనప్పటి నుండి కూడా మహేష్‌ బాబుతో ఈయన సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్‌ బాబు ఇటీవలే మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మరి కొన్ని వారాల్లో ప్రారంభం కాబోతుంది. సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత సందీప్‌ వంగాకు మహేష్‌ ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉందని టాక్‌ వస్తుంది.

ఈ విషయం గురించి సందీప్‌ వంగా స్పందింస్తూ ప్రస్తుతం తాను పూర్తిగా 'కబీర్‌ సింగ్‌' ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాను. మహేష్‌ బాబుకు గతంలో ఒక కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. అది పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ గా మార్చి తీసుకురమన్నారు. స్క్రిప్ట్‌ పూర్తిగా చూసిన తర్వాత ఆయన నిర్ణయం చెబుతానన్నారు. అందుకే ఇప్పుడే మహేష్‌ బాబు గారితో మూవీ విషయంలో స్పందించలేను అన్నాడు. మహేష్‌ కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఆ సినిమా గురించి ఆలోచన లేదన్నాడు. 
Tags:    

Similar News