పాన్ ఇండియన్ 'క్రైమ్ డ్రామా' స్క్రిప్ట్.. రెడీ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్!

Update: 2020-06-22 08:30 GMT
తెలుగు సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డితో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమానే హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడా సంచలనం సృష్టించాడు. ఇప్పుడు సందీప్ కోసం టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు బాగానే వేచి చూస్తున్నారు. ఏదేమైనా కూడా 2017 నుంచి కూడా అర్జున్ రెడ్డితోనే ట్రావెల్ అవుతున్నాడు ఈ దర్శకుడు. తెలుగులో రెండో సినిమా చేస్తాడేమో అనుకుంటే.. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేసాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ అయిపోయినట్లే అనిపిస్తుంది.

రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదివరకు తెలుగులో సినిమాలు చేయాలనుకున్న సందీప్.. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నాడు. ఇక ‘కబీర్ సింగ్’ నిర్మాతలతోనే మళ్ళీ తన తదుపరి సినిమాను తెరకెక్కించబోతున్నాడు సందీప్. ఓ క్రైమ్ ద్రిల్లర్ నేపథ్యంలో సాగే కథను సందీప్ వినిపించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సందీప్ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికి అయినా సిద్దంగా ఉన్నారట నిర్మాతలు. ప్రస్తుతం సందీప్ ఓ బాలీవుడ్ స్టార్ హీరోని తన కథతో మెప్పించాడని తెలుస్తుంది. ఈ ఇద్దరి మధ్య సింగిల్ సిట్టింగ్‌లోనే కథ ఓకే అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఓ క్రైమ్ డ్రామాను రాసుకున్నాడట సందీప్. అసలు క్రైమ్ ఎలా ఉండబోతుందో చూపిస్తానంటూ ఆ మధ్య ఛాలెంజ్ కూడా చేసాడు. ఇప్పుడు అది చేసి చూపించే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా పూర్తి చేసాడట. ఇక ఈ సినిమాను T సీరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతనిలతో పాటు సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ వంగా కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించబోతున్నాడట. ప్రస్తుతం నటీనటుల సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. ఈ క్రైమ్ డ్రామాతో సందీప్ బాలీవుడ్‌లో తన ప్లేస్ సుస్థిరం చేసుకుంటాడో లేదో చూడాలి.
Tags:    

Similar News