కామెంట్: సన్నగా ఉంటే సెక్సీ కాదయా

Update: 2016-04-21 09:13 GMT
సెక్సీగా ఉండడమంటే ఏంటి.. ఇప్పుడు జీరో సైజ్ అంటూ సన్నగా పీలగా బక్కపల్చగా కనిపించడమే సూపర్ సెక్సీ అనే ఫీలింగ్ బాగా ఎక్కువయిపోయింది. కానీ ఇలా జీరో సైజ్ తో ఆకట్టుకున్న భామలు తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా.. ఆడియన్స్ ను ఆకట్టుకున్న అందాల భామల్లో ఎక్కువమంది జీరో సైజ్ ఫిగర్స్ కాదు.

ఇప్పుడున్న హీరోయిన్లలో జీరో సైజ్ ట్రెండ్ ను స్టార్ట్ చేసినది కరీనా కపూర్. ఈమెకు ఈ సైజ్ రాకముందే పెద్ద హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంది. రీసెంట్ గా హైద్రాబాదీ టెన్నిస్ సంచలనం సాయినా మీర్జా ఓ కామెంట్ చేసింది. మిమ్మల్ని చూస్తే గంటలు గంటలు జిమ్ లో గడిపే స్ట్రాంగ్ పర్సన్ అని ఎవరూ అనుకోరు, అయినా ఇలా ఎలా ఫిజిక్ మెయింటెయిన్ చేస్తున్నారనే ప్రశ్నకు.. సానియా ఇచ్చిన ఆన్సర్ అదిరిపోయింది. సెక్సీ అంటే స్ట్రాంగ్ గా ఉండడమే.. సన్నగా ఉన్నంత మాత్రాన ఆకర్షణీయంగా ఉంటారనే ఫీలింగ్ సరికాదు. ఆరోగ్యం - శక్తి - కండలు తిరిగిన దేహం ఎంతో ఎట్రాక్టివ్ అంటూ ఆన్సర్ ఇచ్చింది సానియా.

 ఫ్యాషన్ ఫీల్డ్ సన్నగా ఉండడం సరిపోతుందేమో కానీ.. సినిమా రంగానికి ఇదేమీ మెయిన్ క్వాలిఫికేషన్ కాదు. అంతెందుకు.. బొద్దుగా ఉన్న భామలు ఇండస్ట్రీలను ఏలిన చరిత్ర చాలానే ఉంది. ఇప్పటి హీరోయిన్లు కూడా ఇలా సన్నబడ్డంపై కాకుండా.. ఫిట్ గా ఉంటూనే ట్యాలెంట్ ను ఇంప్రూవ్ చేసుకోవడంపై దృష్టి పెడితే బెటర్.
Tags:    

Similar News