ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇప్పుడు ట్విట్టర్ ప్రపంచంలో పడి నవ్వులు పాలు అయ్యింది. తొందరపడి చేసినా.. తెలియక చేసినా.. ఒక ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరస్ లా మరి చిన్న తుఫాను సృష్టించింది. సానియా ఒక మొబైల్ కంపెనీ తరుపున ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా తన మైక్రో బ్లాగ్లో ఒక ట్విట్ చేసింది. ఇలా ట్వీట్లు వేసినందుకు సెలబ్రిటీలకు ట్వీటుకింత అని డబ్బులిస్తారులే. మన సినిమా హీరోయిన్లు ఎప్పటినుండో ఇదే పనిలో ఉన్నారు.
అయితే సానియా వేసిన ట్విట్ ఏంటంటే ''నేను ఏమి టెక్ ఎక్సపర్టును కాను.. అయనా ఈ కొత్త మొబైల్ వన్ ప్లస్ 3T వాడటం నాకు భలే నచ్చింది'' అని ట్విట్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ ట్విట్ తను ప్రచారం చేస్తున్న మొబైల్ నుండి కాకుండా తన ఐఫోన్లోనుండి చేయడంతోనే వచ్చింది అసలు సమస్య. ట్విట్టర్ ను బాగా వాడే వాళ్ళు ఇది తొందరగా గుర్తించి సానియా చేసిన తెలివి తక్కువ పనిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఒక బ్రాండ్ కి ప్రచారం చేయడం బాగానే ఉన్న ఇలా సరిగా తెలుసుకొని చేస్తే బాగుంటుంది అని విమర్శలు చేసారు సదురు ట్విట్టర్ యూజర్లు. వెంటనే అది గ్రహించిన సానియా ఆ ట్విట్ ను తొలిగించింది . కానీ ఏమి లాభం లేదు అప్పటికే జరగవలిసింది అంతా జరిగింది.
“మనం ఏమి చేస్తున్నామో చూసి జాగ్రత్తగా చేయాలి అమ్మ అని ఒకరు ”.. ''సానియా నువ్వు కాస్త మారాలి'' అని మరొకరు.. ''నీ తెలివి చూపించాలని చేసే ట్విట్ నీ తెలివితక్కువతనాన్ని బయటపెట్టింది” అని ఇంకొకరు కామెంట్లు చేశారు. పాపం టెన్నిస్ పరంగా ఇండియాకు ఎంతో పేరు తెచ్చిన ఈ సుందరాంగి.. అనసవరంగా ఇప్పుడు ఇలా హేళనల పాలైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/